హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వెళ్లిన కొద్దిసేపటికే ప్రమాదం: 4గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

four dead as current wires fall
హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబలించింది. వర్షం కురుస్తోందని తలదాచుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న బస్టాప్‌లోకి వెళ్లిన వారిని విద్యుత్ బలిగొంది. మరో ముగ్గురు యువకుల్ని తీవ్ర గాయాలపాలు చేసింది. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మంగళవారం సాయంత్రం నగరం నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న రెండో బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రభృతులు హజ్ హౌస్ వద్ద వీడ్కోలు పలికారు. దాదాపు 30 నిమిషాల పాటు ముఖ్యమంత్రి హజ్ హౌస్‌లో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఉన్నారు. యాత్రికులకు వీడ్కోలు పలికిన కెసిఆర్ అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే వర్షం ఊపకుంది. వర్షం దాటికి విద్యుత్ వైర్లు తెగి బస్టాప్‌పై పడడంతో ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో మరణించినవారిని రాకేష్, రూపేష్, కోమల్, సుశీల్ యాదవ్‌గా గుర్తించారు. వీరంతా నగరంలో జిమ్మి సర్కస్‌లో పనిచేస్తుంటారని తెలిసింది. మృతులంతా పాతికేళ్ల వయసులోపు వారే. నగరంలో విషాదాన్ని నింపిన ఈ సంఘటన నాంపల్లి హజ్ హౌస్ ముందున్న బస్టాప్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. సాయంత్రం భారీ వర్షం కురియడంతో వీరంతా హజ్ హౌస్ ముందున్న బస్టాప్‌లో నిలబడ్డారు. సరిగ్గా అదే సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి బస్టాప్‌పై పడిపోయాయి. దీంతో పెద్ద మొత్తంలో విద్యుత్ పాస్ కావడంతో బస్టాప్‌లో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా సుశీల్ యాదవ్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు రూపేష్, రాకేష్, కోమల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో భద్రపరిచారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఆసుప్రతికి వచ్చి వివరాలను ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

English summary
Four Madhya Pradesh youth died as current wires fall on them in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X