హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.5 భోజనం సక్సెస్, ఇక రూ.1కి టిఫిన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆకలితో అలమటించే వారి పొట్టనింపేందుకు కోసం మహానగర పాలక సంస్థ సేవా ధృక్పథంతో ప్రారంభించిన రూ.5కే సబ్సిడీ ఆహార కేంద్రాలను వచ్చే నెల 2వ తేదీ కల్లా 50కి విస్తరించునున్నట్లు నగర మేయర్ మాజీద్ హుస్సేన్ వెల్లడించారు.

బల్దియా ప్రధాన కార్యాలయం సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో శనివారం మరో కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జిహెచ్‌ఎంసి ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందిందన్నారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

కేవలం అభివృద్ధి, పౌరసేవల నిర్వహణ పనులే గాక, సామాజిక సేవలో కూడా తనవంతు పాత్రను పోషిస్తోందని మేయర్ అన్నారు. ఈ పథకాన్ని నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో అమలు చేసేందుకు వీలుగా 50 కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనకు త్వరలో జరగనున్న స్థాయి సంఘం సమావేశంలో ఆమోదం ఇవ్వనున్నట్లు తెలిపారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

దీంతో పాటు త్వరలోనే కేవలం ఒక్క రూపాయికే అల్పాహారం అందించే మరో బృహత్తర పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ మాట్లాడుతూ చాలా తక్కువ ధరకే భోజనాన్ని అందజేస్తున్న హరేరామ్ హరే కృష్ణ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

ఇలాంటి మహోన్నతమైన పథకాలు మరిన్ని అమల్లోకి వస్తే తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఆకలి, పస్తులతో గడపాల్సిన దుస్థితి తొలిగిపోతుందన్నారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

త్వరలో ఏర్పాటు చేయనున్న 50 సబ్సిడీ ఆహార కేంద్రాలను ప్రత్యేక డిజైనింగ్‌తో ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు.

భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

ఈ కేంద్రాల్లో టెంట్, మంచినీటి వసతితో పాటు భోజనం వడ్డించేందుకు ప్రత్యేకంగా ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేసి, ఆహారాన్ని పంపిణీ చేసిన తర్వాత వాటిని తొలగించేందుకు వీలుగా డిజైనింగ్‌లను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

ఆకలితో అలమటించే వారి పొట్టనింపేందుకు కోసం మహానగర పాలక సంస్థ సేవా ధృక్పథంతో ప్రారంభించిన రూ.5కే సబ్సిడీ ఆహార కేంద్రాలను వచ్చే నెల 2వ తేదీ కల్లా 50కి విస్తరించునున్నట్లు నగర మేయర్ మాజీద్ హుస్సేన్ వెల్లడించారు.

 భోజన కేంద్రాలు

భోజన కేంద్రాలు

బల్దియా ప్రధాన కార్యాలయం సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో శనివారం మరో కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జిహెచ్‌ఎంసి ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందిందన్నారు.

English summary
Greater Hyderabad Municipal Corporation launches Rs.5 meal scheme at Liberty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X