వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హజ్‌ యాత్ర: జెండా ఊపిన కెసిఆర్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సిఎం కెసిఆర్ విమర్శించారు. నాంపల్లి హజ్ భవన్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన రెండో దశ యాత్రికుల బస్సును ముఖ్యమంత్రి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మక్కాలో ప్రార్థించాలని హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు ప్రభుత్వం రూ. 51వేల రూపాయాలు ఇస్తుందన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా పెళ్లి చేసుకోబోయే యువతి ఖాతాలో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

వివాహ సమయంలో ఇచ్చే సామాగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వం మొదట అనుకున్నామని, అందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని భావించి నేరుగా నగదు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హజ్ భవనం పక్కన నిర్మించబోయే వక్ఫ్ బోర్డు భవన నిర్మాణానికి అన్నిరకాల పన్నులు మినహాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహ్మారెడ్డి, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ సలీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సిఎం కెసిఆర్ విమర్శించారు.

కెసిఆర్

కెసిఆర్

నాంపల్లి హజ్ భవన్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన రెండో దశ యాత్రికుల బస్సును ముఖ్యమంత్రి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మక్కాలో ప్రార్థించాలని హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

పేద ముస్లిం యువతుల వివాహాలకు ప్రభుత్వం రూ. 51వేల రూపాయాలు ఇస్తుందన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా పెళ్లి చేసుకోబోయే యువతి ఖాతాలో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

English summary
Chief Minister K. Chandrashekar Rao announced complete exemption of the building fee for the Wakf Board building under construction in the Haj House premises. The Chief Minister made this announcement while addressing the second batch of Haj pilgrims here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X