హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం కేసీఆర్ ప్రణాళికలు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా తాము విధానాలు, పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. వీటికి అనుగుణంగా కేంద్రం నుండి నిధులను కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన 14వ ఆర్దిక సంఘం సభ్యులు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వారితో జరిగే సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు అందించాలనే విషయంపై అధికారులతో ముఖ్యమంత్రి బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

ప్రతి శాఖ ఆద్వర్యంలో ఏఏ పథకాలు ప్రవేశపెడుతున్నాం, వాటికి ఎలాంటి విధానాలు రూపొందిస్తున్నాం అనే విషయాలను ఆర్దిక సంఘానికి స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు. మన ఊరు మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, చెరువుల పునరుద్దనణ, హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ, గిరిజనన సంక్షేమం, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, తెలంగాణలో అమలవుతున్న విషయాన్ని కేంద్రానికి చెప్పాలని, సహాకారం కోరాలని ముఖ్యమంత్రి చెప్పారు.

మన ఊరు మన ప్రణాళిక ద్వారా గ్రామంలో ప్రతి వ్యక్తి ఎలాంటి అవసరాలును కోరుకుంటున్నాడో, గ్రామానికి ఏమి కావాలి అనే విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, ఆర్దిక సంఘం కూడా ఈ విషయాన్ని దృష్ఠిలో పెట్టుకోని నిధులు కేటాయింపు జరపాలని ప్రభుత్వం తరుపన కోరనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

గత ప్రభుత్వాలు వల్ల నిధుల దుర్వినియోగం అవడం తప్ప ఫలితం లేదన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం అటు చెరువులను పునరుద్ధరించడం, ఇటు హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడటానికి, భూగర్బ జలాలను పెంచడానికి చేస్తున్న కార్యక్రమాలను ఆర్దిక సంఘానికి చెప్పాలన్నారు.

 తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

హైదరాబాద్ కృష్ణా నీటిని తరలించడానికి కూడా ప్రణాళిక సిద్దంగా ఉందని, తెలంగాణకు అత్యవసరమైన పాలమూరు, పాకాల -జూరాలా ప్రాజెక్టు కడుతున్నామని కూడా చెప్పాలనన్నారు. వీటి వల్ల కలిగే లాభాలు సవివరంగా చెప్పడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, చొరవను, చిత్త శుద్దిని అర్దం చేసుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

 తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్యక్రమం గురించి ఆర్దిక సంఘానికి చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. పోలీస్ వ్యవస్దను బలోపేతం చేయడానికి, సింగపూర్ తరహాలో నైబర్ హుడ్ పోలీసింగ్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయాలను కూడా వివరించాలన్నారు.

 తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కె. చంద్రశేఖర రావు ప్రణాళికలు

హైదరాబాద్‌లో అత్యున్నత ప్రమాణాలతో చెపట్టోబోయే రోడ్ల నిర్మాణం, ఉద్యమ స్పూర్తితో సాగే అడవుల రక్షణ లాంటి వినూత్న కార్యక్రమాలను కూడా వివరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, వివిధ శాఖల కార్యదర్శులుపాల్గోన్నారు.

English summary
Telangana government is planning to implement the electoral promises from Dussera festival in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X