వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రోపై కేసీఆర్‌కు కోదండ, కోర్టుకు వెళ్లిన రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodanda Reddy on Metro issue
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్ విషయంలో జరుగుతున్న పరిణామాల పైన ప్రజలకు సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉందని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి గురువారం అన్నారు. ప్రాజెక్టు కొనసాగించడం తమ వల్ల కాదని ఎల్ అండ్ టీ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడే స్పందించకుండా పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన తర్వాత చర్చలకు పిలవడమేమిటని ప్రశ్నించారు.

చర్చల అనంతరం ఎల్ అండ్ టీ, ప్రభుత్వం ఇచ్చిన వివరణలు సరిగా లేవన్నారు. మరో నేత మహేష్ మాట్లాడుతూ.. కాన్వాయ్‌లోని కార్ల రంగును, క్యాంపు కార్యాలయాలను మార్చినంత సులువుగా మెట్రో అలైన్‌మెంట్ మార్చవచ్చని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఫీజుల పెంపు జీవోలను కొట్టేయండి: రేవంత్ రెడ్డి

ప్రయివేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఫీజులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవోలు 9, 10లను సవాల్ చేస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించేవిగా ఉన్న ఆ జీవోలను కొట్టేయాలన్నారు.

విద్యార్థుల ఆర్థిక స్థోమతను బట్టి ప్రవేశాలు కల్పించడం కోసం 15 శాతం వెయిటేజీ మార్కులను యాజమాన్యాలే నిర్ణయించుకునేలా ప్రభుత్వం ఆ జీవోలలో ఉద్దేశ్యపూర్వకంగా వెసులుబాటు కల్పించిందన్నారు. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 32లను ఉల్లంఘించేవిగా ఉన్న ఈ రెండు జీవోలను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు.

English summary
Telangana PCC leader Kodanda Reddy on Metro issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X