మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెప్టెంబర్17పై కేసీఆర్‌‌కి కోదండ షాక్, పొన్నాల ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram suggests KCR on Sep 17
హైదరాబాద్: సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం అధికారికంగా జరిపితే బావుంటుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 17ను కొందరు విలీనం దినంగా, మరికొందరు విమోచన దినంగా పాటిస్తుంటారు. తెలంగాణకు నిజాం పాలన ముగిసిన ఈ రోజును అధికారికంగా నిర్వహించాలని కోదండరామ్ తెరాస ప్రభుత్వానికి హితవు పలికారు.

సెప్టెంబర్ 17ను విలీనం దినోత్సవంగా పాటించాలన్నారు. దీనికి మతం రంగు పులమొద్దన్నారు. సెప్టెంబర్ 17వ జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలన్నారు. నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఇలాంటి రోజును అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు.

కేసీఆర్‌కు పొన్నాల హితవు

ప్రజల మద్దతు తమకే ఉందంటున్న కేసీఆర్ ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వేరుగా హితవు పలికారు. సీపీఐ, సీపీఎం, మజ్లిస్ పార్టీలు తెరాసకు మద్దతు పలకడంతో ఆ పార్టీ గెలిచిందన్నారు. తాము తెరాసకు, బీజేపీ-టీడీపీలకు గట్టి పోటీ ఇచ్చామన్నారు.

తెరాస గెలుపుకు అర్థ, అంగ, అధికార బలం కూడా కలిసి వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో అధికార బలం ఉంటుందనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. ప్రజల పక్షాన నిలబడడమే తమ కర్తవ్యం అన్నారు. అందులో ఎలాంటి రాజీ లేదన్నారు. ఉప ఎన్నికల ఓటమి బాధ్యత తమదే అన్నారు. తాను అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

English summary
Telangana JAC Chairman Kodandaram has suggested Telangana CM KCR on September 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X