నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలపాగాతో నాయిని: పోలీసుల వందనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం బంగారు తెలంగాణను ఆచరణలో చేసి చూపిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేస్తూ, తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మద్నూర్‌ మండల కేంద్రంలో రూ. 1.08కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణప్రజలకు వందనాలు తెలుపుతూ ప్రజలకువంగి వందనం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన ప్రజలకు అక్టోబర్‌ 2నుంచి సంక్షేమ పథకాలు అందనున్నాయని తెలిపారు. మనం అందరం కలిసి ఈ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేద్దామన్నారు.

మద్నూర్‌లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం ప్రజలకు చిరుకానుక అని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పెద్దపెద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా ఉండవని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అవినీతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ బండా రం బయట పడనుందని గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతిని వెలికితీస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని నీతి నిజాయితీగా పని చేస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఎస్సీ, బీసీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లిలకు రూ.51వేలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ డి.రాజు, ఎంపీ బీబీ. పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

నాయిని

నాయిని

జిల్లాలోని జిల్లాలోని మద్నూర్‌ మండల కేంద్రంలో రూ. 1.08కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

నాయిని

నాయిని

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం బంగారు తెలంగాణను ఆచరణలో చేసి చూపిస్తుందని ఆయన అన్నారు.

నాయిని

నాయిని

న్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేస్తూ, తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

నాయిని

నాయిని

ముందుగా తెలంగాణప్రజలకు వందనాలు తెలుపుతూ ప్రజలకువంగి వందనం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నాయిని

నాయిని

తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన ప్రజలకు అక్టోబర్‌ 2నుంచి సంక్షేమ పథకాలు అందనున్నాయని తెలిపారు. మనం అందరం కలిసి ఈ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేద్దామన్నారు.

నాయిని

నాయిని

మద్నూర్‌లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం ప్రజలకు చిరుకానుక అని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పెద్దపెద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పోలీసుల వందనం

పోలీసుల వందనం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా ఉండవని అన్నారు.

నాయిని

నాయిని

గత ప్రభుత్వాలు చేసిన అవినీతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ బండా రం బయట పడనుందని గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతిని వెలికితీస్తున్నామన్నారు.

నాయిని

నాయిని

తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని నీతి నిజాయితీగా పని చేస్తుందని తెలిపారు.

నాయిని

నాయిని

కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఎస్సీ, బీసీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లిలకు రూ.51వేలను కట్నంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.

నాయిని

నాయిని

వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500పింఛన్లు విజయదశమి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
Telangana home minister Naini Narsimha Reddy on Thursday inaugurated a fire station in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X