సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ ఇంట్లో బతుకమ్మ పేర్చిన కవిత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారు బతుకమ్మలను ఎత్తుదాం, బంగారు తెలంగాణను సాధిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపు ఇచ్చారు. మంగళవారం మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో మంత్రి హరిష్‌రావు నివాసంలో ఆమె బతుకమ్మను పేర్చారు.

హరీష్‌రావు భార్య శ్రీనితతో కలిసి కవిత బతుకమ్మకు మంగళహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భ్గంగా కవిత మాట్లాడారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ చేసుకోవాలంటే అనుమతి తెచ్చుకుని చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిందని, తొలి బతుకమ్మ పండుగను ఈ రోజున మనం చేసుకుంటున్నామని అన్నారు.

ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె పిలుపు ఇచ్చారు. కోటి బతుకమ్మలు ఎత్తుదాం, కొత్త రాష్ట్రాన్ని సాధిద్దాం అని చెబితే నాతోపాటు కలిసి వచ్చారని, అదే విధంగా ఈరోజు బంగారు బతుకమ్మ ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దామని మీ ముందుకు తెలంగాణ జాగృతి వచ్చిందని కవిత అన్నారు.

బతుకమ్మను పేరుస్తూ కవిత

బతుకమ్మను పేరుస్తూ కవిత

సిద్ధిపేటలోని తెలంగాణ మంత్రి హరీష్ రావు నివాసంలో తెరాస ఎంపి కల్వకుంట్ల కవిత మంగళవారంనాడు బతుకమ్మను పేర్చారు.

హరీష్ భార్య కూడా..

హరీష్ భార్య కూడా..

కవితతో పాటు హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.

పద్మా దేవేందర్ రెడ్డి సైతం..

పద్మా దేవేందర్ రెడ్డి సైతం..

సిద్ధిపేటలో హరీష్ రావు నివాసంలో బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో కవిత, శ్రీనితలతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

బతుకమ్మ ఇలా ఆడారు..

బతుకమ్మ ఇలా ఆడారు..

మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్వకుంట్ల కవిత, శ్రీనితలతో పాటు పెద్ద యెత్తున మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మను మోశారు..

బతుకమ్మను మోశారు..

ఎంపి కల్వకుంట్ల కవిత శిరసుపై బతుకమ్మను మోస్తూ ఇలా సిద్ధిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో కవిత..

బతుకమ్మ వేడుకల్లో కవిత..

మెదక్ జిల్లా సిద్ధిపేటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, పిల్లలతో పాటు ఆడి పాడిన కవిత, పద్మా దేవేందర్ రెడ్డి...

English summary
Telangana Rastra Samithi (TRS) Nizamabad MP Kalwakuntla Kavitha participated Bathukamma celebrations at Siddipet in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X