హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్స్ రూటింగ్‌తో మెగా చీటింగ్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తేలిగ్గా డబ్బులు సపాందించాలనే దురాశతో అడ్డదారి తొక్కిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, కంప్యూటర్ పరిజ్ఝానం గల ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను హైజాక్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 3.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

Pictures: Six accused in calls rooting

అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి వినియోగదారుల నుంచి 30 సెకన్లకు రూపాయి చొప్పున వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వచ్చారు. శుక్రవారంనాడు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌వోటి ఓఎస్డీ రామచంద్రా రెడ్డి వెల్లడించారు.

Pictures: Six accused in calls rooting

హైదరాబాదులోని కూకట్‌పల్లికి చెందిన దామర్ల వెంకటశివప్రసాద్, కల్లూరి కళ్యాణ్, రావూరి దుర్గా శ్రీనివాస్, మాదాపూర్‌కు చెందిన మద్దులు సుబ్బ మనోజ్ దీపక్, ఆల్వాల్‌ు చెందిన నరేష్ కుమార్ అక్రమంగా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీ ఏర్పాటు చేశారు. లోకల్, నాన్ లోకల్ సిమ్ కార్డులను ఉపయోగించి వాయిస్ ఓవర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ (విఓఐపి) వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్‌వర్క్ (పిఎస్టీఎన్) వ్యవస్థ ద్వారా లోకల్ కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా గేట్ వే ద్వారా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

టెలికామ్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటి నిపుణుల సహాయంతో ఈ ఫోన్ కాల్స్ కుంభకోణాన్ని ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. వారు కూకట్‌పల్లి, ఆల్వాల్, మాదాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌ఛేంజీ పరికరాలను, 4 ల్యాప్ టాప్‌లను, ఒక ఐఫోన్‌ను, 11 సెల్‌ఫోన్లు, 281 సిమ్ కార్డులు, 72 రూటర్లు, 9 క్వింటర్ పోర్డ్ స్విచ్‌లు, 24 -పోర్ట్ ప్యాచ్ పానల్స్ ఏడు, 16- ఆంటీనా వైర్‌లెస్ టర్మినల్స్ 62 స్వాధీనం చేసుకున్నారు.

English summary
Cyberabad cyber crime police arrested six persons for indulging in cyber crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X