డాలస్ లో శ్రీనివాస్ గజల్స్

మంగళవారం, నవంబర్ 3, 2009, 9:54 [IST]
Dallas
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌)-నార్త్‌ టెక్సాస్‌ టీమ్‌, ట్యాన్‌టెక్స్‌ సహకారంతో నిర్వహించిన సంగీత విభావరి డాలస్‌ నగరంలోని తెలుగు వారిని అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సింహ పాడిన నాట్స్‌ స్వాగత గీతంలో ప్రారంభించిన కార్యక్రమంలో ముందుగా వరద మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తరువాత రఘరామ్‌, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ అవార్డు గ్రహీత శ్రీనిధిలు ఎన్నో చిత్ర గీతాలు పాడి శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను వరద బాధితుల సహాయానికి ఉపయోగిస్తారు.

'అనురాగం నువ్వైతే అమ్మవై, ఆప్యాయత నువ్తైతే అన్నవై, అన్నార్థుల, దాహార్థుల, విధి వంచితులను ఆదుకునే ఆత్మ బంధువై కదిలిరా' అన్న గజల్‌ శ్రీనివాస్‌ పిలుపు నందుకుని డాలస్‌ తెలుగువారంతా ముందుకు వచ్చి వీలైన ఆర్ధిక సహాయం అందజేసారు. శ్రీనివాస్‌ గజల్స్‌ శ్రోతల హృదయాలను కదిలించాయి. గాయకుడు సింహ ఆద్యంతం తనదైన శైలిలో పాడిన పాటలు, హీరో రాజా మాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది పాల్గొన్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs