ఎన్నారైలకు ఆబ్సెంటీ వోటింగ్ హక్కు కల్పించేందుకు ప్రయత్నించాలని కోరుతూ పీపుల్ ఫర్ లోకసత్తా తరఫున అమెరికా ఎన్నారైలు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, నర్సారావుపేట పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. బే ఏరియా సన్నివాలె దేవాలయంలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వారు ఈ వినతిపత్రం సమర్పించారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నారైలు స్వయంగా వచ్చి ఓటు చేయాలంటూ ప్రభుత్వం బిల్లు తెచ్చిన విషయం తెలిసిందే. దానికి పీపుల్ ఫర్ లోకసత్తా లగడపాటి రాజగోపాల్ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాల్లో దాదాపు 2.5 కోట్ల మంది భారతీయ వోటర్లు ఉంటారని, వారంతా పోలింగ్ రోజు భారతదేశానికి వెళ్లడం ఆచరణలో సాధ్యం కాదని, అందువల్ల అబ్సెంటీ వోటింగ్ రైటు కల్పించాలని పీపుల్ ఫర్ లోకసత్తా ప్రతినిధులు అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించాలని వారు పార్లమెంటు సభ్యులను కోరారు.
ఎన్నారైలది న్యాయమైన కోరిక అని, ఈ విషయంపై తాను ప్రభుత్వానికి విన్నవిస్తానని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. లగడపాటి రాజగోపాల్ కూడా దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. తాను వ్యక్తిగతం విషయాన్ని పరిశీలించి, విధివిధానాలు ఎలా ఉండాలనే విషయంపై మాట్లాడుతానని ఆయన చెప్పారు. లోతుగా విశ్లేషణ జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.