వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో షణ్ముఖశర్మకు ఘన సత్కారం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర 9వ వార్షికోత్సవంలో సామవేదం షణ్ముఖశర్మను ఘనంగా సత్కరించారు. స్థానిక సన్నీవేల్‌ హిందూ దేవాలయం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామవేదం షణ్ముఖశర్మ 'భావితరాలకు భారతీయ సంస్కృతి ఆవశ్యకత' అనే అంశంపై ప్రసంగించారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ తెలియాజేయాల్సిన అవసరముందన్నారు. భారతీయతను, తెలుగుదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకు సిలికానాంధ్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.

ఈసందర్భంగా మధుబాబు షణ్ముఖశర్మను ఘనంగా సత్కరించారు. మర్తి యజ్ఞనారాయణశర్మ, రాళ్లబండి సుబ్రహ్మణ్యశర్మ వేద ప్రవచనాలతో మొదలైన సభాకార్యక్రమాన్ని సిలికానాంధ్ర అధ్యక్షుడు చామర్తి రాజు ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లుగా సిలికానాంధ్ర చేపట్టిన కార్యక్రమాలను చామర్తిరాజు, దిలీప్‌ కొండిపర్తి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గత రెండు వారాలుగా రామాచారి నిర్వహించిన లలిత సంగీత శిక్షణ శిబిరంలో పాల్గొన్న కళాకారులు తమ మధుర గానాలతో ప్రేక్షకులను అలరించారు. రామాచారి చేస్తున్న సంగీత సేవలను ప్రశంసిస్తూ తల్లాప్రగడ రావు ఆయనకు 'సిలికానాంధ్ర సంగీత భారతి' బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. ఈసందర్భంగా దిలీప్‌ కొండిపర్తి ఒక మంచుగడ్డను మయూరశిల్పంగా మలిచి తన హిమ శిల్పకళాచాతుర్యాన్ని ప్రదర్శించారు. దాదాపు 1500 మంది తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జగన్‌ యెలిసెట్టి, మల్లాది రఘు ఆర్థికసాయమందించారు. నరాల దేవేందర్‌ తదితరులు పాల్గొనగా మాడభూషి విజయసారధి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X