వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్లాంటాలో ఆటా సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) బోర్డు సమావేశం ఈ నెల 19వ తేదీన అట్లాంటా జిఎలోని హిల్టన్ హోటల్‌లో జరిగింది. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద యెత్తున పాల్గొననారు. ఈ సమావేశంలో ఆటా స్టాండింగ్ కకమిటీ చైర్స్, ప్రాంతీయ సమన్వయకర్తలు, గ్రేటర్ అట్లాంటా తెలుగు కమ్యూనిటీ స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు ఆసోసియేషన్ ఆప్ మెట్రో అట్లాంటా (తామా), గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (గాటా) నాయకత్వాలు కూడా ఈ సమావేశంలో పాలు పంచుకున్నాయి. ట్రైవ్యాలీ విద్యార్థుల సమస్యతో పాటు తెలుగు ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆటా చేసిన కృషిని జిన్నా వివరించారు. వచ్చే రెండేళ్ల పాటు అమెరికాలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆయన చెప్పారు.

ఆటా కోశాధికారి సత్యనారాయణ కండిమల్ల తన నివేదికను సమర్పించారు. డిసెంబర్‌లో భారతదేశంలో ఆటా వేడుకలను నిర్వహించాలనే ప్రతిపాదనను తమ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం చెప్పారు. సభ్యత నమోదులో జరిగిన ప్రగతిని ఆటా కార్యాలయ సమన్వయకర్త నరేందర్ చెమర్ల వివరించారు. యువ నాయకత్వాన్ని ముందుకు తెచ్చే బాధ్యతను జిన్నా కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డికి అప్పగించారు. ఆయనను కన్వీనర్‌గా ప్రకటించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా గత అధ్యక్షుడు తామా వ్యవస్థాపక సభ్యుడు డాక్ట్ర జగన్మోహన్ రావును సమావేశం సదస్సు సమన్వయకర్తగా ఎన్నుకుంది. 12వ ఆటా సదస్సును విజయవంతం చేయాలని జిన్నా కోరారు. డాక్టర్ సంధ్య గవ్వా, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, రాజేశ్వర్ టెక్మల్, పరమేశ్ భీమిరెడ్డి వంటి అనుభజ్ఞుల సహకారంతో సదస్సు విజయవంతమవుతుందని ఆయన అన్నారు.

English summary
American Telugu Association (ATA) held its Board meeting in Atlanta, GA on March 19th, in Hilton Hotel with a huge gathering of Telugu across from US under the leadership of ATA President Dr.Rajender Jinna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X