వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీలునామపై ఆటా సదస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
పెద్దగా సొమ్ము లేకపోయినా వీలునామా అవసరమా అనే అంశంపై అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్‌లోని రుచి ప్యాలెస్‌లో ఈ నెల 26వ తేదీన సదస్సు నిర్వహించింది. నార్త్ టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సహకారంతో ఆటా ఈ సదస్సును నిర్వహించింది. ఆటా డిఎఫ్‌డబ్ల్యు ప్రాంతీయ సమన్వయకర్త అరవింద్ రెడ్డి ముప్పిడి స్వాగతం చెప్పారు. తెలుగు సమాజానికి ఆటా అందిస్తున్న సేవలను టాంటెక్స్ ఎన్ఎంఎస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జులైలో జరిగే రజతోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన వివరించారు. కీలకోపన్యాసం చేయడానికి వచ్చిన కవిత ఆకులను ఆటా స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకట రెడ్డి ముస్కు పరిచయం చేశారు.

వీలునామా కోసం అనుసరించాల్సిన ప్రణాళికను కవిత ఆకుల వివరించారు. ఎస్టేట్ ప్లానింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. సురేష్ జి రెడ్డి వందన సమర్పణతో సదస్సు ముగిసింది. సదస్సుకు సహకరించిన ఆకుల అండ్ అసోసియేట్స్, మసాలా వోక్, మిర్చి స్పైసెస్ అండ్ కేఫ్, క్విక్ చాయిస్ ట్రావెల్స్, స్వదేశీ ప్లాజాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సదస్సుకు ముందుగా వచ్చిన మొదటి ఇరవై మందికి వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ సర్వీస్ కూపన్లను అనంత రెడ్డి పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, అరవింద్ రెడ్డి ముప్పిడి, సురేష్ రెడ్ిడ, భాను చౌదరి, సుధీర్ గుడా మహేంద్ర గనపురం, వెంకట్ ముస్కు, శశి కనపర్తి, రవి వెనిశెట్టి, చంద్ర బండారు, మహేష్ మేరెడ్డి, రఘువీర్ బండారు, ఎన్ఎంఎస్ రెడ్డి అందించారు.

English summary
“Do I still need a Will even though I don’t have a lot of money?” is the theme of the afternoon gathered at the Ruchi Palace Indian Cuisine, Carroll ton TX as a part of the Will & Estate Seminar hosted by the American Telugu Association (ATA) on March 26, 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X