వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో ఆటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ATA Organizes India Independence Day Celebrations
అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 20వ తేదీన ఆటా ఆధ్వర్వంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. మధు సూదన్ రెడ్డి స్వాగత వచనాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పిల్లలు భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన స్వాతంత్ర్య గీతం అందరినీ ఆకట్టుకుంది. శాస్త్రీయ, దేశభక్తి గీతాలకు మూడేళ్ల వయసు గల పిల్లల నుంచి పలువురు నృత్యాలు చేశారు.

భారతదేశానికి చెందిన పిల్లలల్ో భారత సంప్రదాయాలపై చైతన్యం కలిగించాల్సిన అవసరం గురించి ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా మాట్లాడారు. వచ్చే ఏడాది జులై 6,7,8 తేదీల్లో అట్లాంటాలో జరిగే 12వ ఆటా సమావేశాలను, యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆరోగ్య చైతన్యం, వైద్య విద్య రంగాల్లో తమ సహకారం అందించడానికి వడ్డేపల్లి కృష్ణ, ఎఎపిఐ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత కనుమూరి ముందుకు వచ్చారు. అక్టోబర్ 9వ తేదీన న్యూయార్కులో జరిగే ఆటా దసరా వేడుకల గురించి బల్వంత్ కొమ్మిడి వివరించారు. డాక్టర్ శ్రీనివాస రెడ్డి కమ్యూనిటీ లీడర్ల గురించి చెప్పారు.

English summary
ATA celebrated India Independence day on Aug 20, 2011 at Akbar Restaurant in NY. The theme was to explain India's independence, achievements, bring awareness on Indian Culture and Tradition to the next generation Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X