వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైవ్యాలీపై కృష్ణకు ఆటా కృతజ్ఞతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

SM Krishna
ఇమిగ్రేషన్ ఫ్రాడ్‌కు పాల్పడి మూతపడిన ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రత్యామ్నాయాలు చూపించే విషయంలో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫలితం సాధించినందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణకు కృతజ్ఞతలు తెలిపింది. భారతీయ విద్యార్థులు తమ చదువులు కొనసాగించడానికి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ చొరవ చూపే విధంగా కృష్ణ ఒత్తిడి తెచ్చారని ఆటా తెలిపింది. తన న్యాయ నిపుణుల ద్వారా విద్యార్థులకు తగిన సహాయం అందించడానికి ఆటా విశేషంగా కృషి చేసింది. ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువు కొనసాగించడానికి విద్యార్థులకు ప్రత్యామ్నాయాలు చూపాలని ఆటా అమెరికా సెనేటర్లను, కాంగ్రెసు సభ్యులను కోరుతూ వచ్చింది. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వివిధ నగరాల్లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను తరుచు సంప్రదించడమే కాకుండా, అమెరికాపై ఒత్తిడి తేవాలని భారత దౌత్యవేత్తపై ఆటా ఒత్తిడి పెట్టింది.

అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు తమ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకోవాలని, దాని వల్ల భవిష్యత్తులో వారికి తోడ్పడానికి వీలవుతుందని ఆటా ఓ ప్రకటనలో తెలిపింది. ఆటా విద్యార్థులకు తగిన సూచనలు చేస్తుందని, కౌన్సెలింగ్ చేస్తుందని తెలిపారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర నిర్వహించిన మీడియాకు ఆటా కృతజ్ఞతలు తెలిపింది. ఆటా వివరాలో కోసం http://www.ataworld.org చూడవచ్చు.

English summary
ATA expressed its sincere gratitude & thanks to Indian external affairs minister Sri. S. M. Krishna for taking initiative on Tri-Valley “sham” and reaching out to US secretary of state Mrs. Hillary Clinton for bringing pressure on US government to provide students with a viable option(s) to continue their education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X