వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో ఎన్నారైల వర్క్‌షాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

ATA workshop in Dallas
అమెరికాలోని డల్లాస్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) కాలేజ్ ప్రిపరేషన్ వర్క్‌షాపును నిర్వహించింది. ఈ వర్క్‌షాపును నార్త్ టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్త్), ఆటా సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా హాజరయ్యారు. ఆటా డిఎఫ్‌డబ్ల్యు ప్రాంతీయ సమన్వయ కర్త అర్వింద్ రెడ్డి ముప్పిడి స్వాగతం చెప్పారు. కాలేజ్ రెడీనెస్‌పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. టాంటెక్స్ స్ఫూర్తి సుష్మి కౌసూరి కీలక ప్రసంగం చేసిన నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిలర్ డాక్ట్రర్ సుష్మా దండేకర్‌ను పరిచయం చేశారు.

సంబంధిత అంశాలను దండేకర్ క్షుణ్నంగా వివరించారు. సరైన ప్రణాళికను రూపొందించుకుని దాన్ని అమలు చేయడం చాలా అవసరమని దండేకర్ చెప్పారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి తమ సంస్థ చేస్తున్న కృషిని వివరిచారు. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ ఆర్. జిన్నా వచ్చే నెల జరిగే అటా వేడుకలను గుర్తు చేశారు. ఆటా బృందం డాక్టర్ సంధ్యా గవ్వా, అనంత రెడ్డి పజ్జూరు, సతీష్ రెడ్డి, అర్వింద్ రెడ్డి ముప్పిడి, ధీరజ్ ఆకుల, అజయ్ రెడ్డి మెమెంటోతో ముఖ్య అతిథిని సత్కరించారు. సురేష్ జి. రెడ్డి వందన సమర్పణ చేశారు.

English summary
ATA in association with TANTEX organized College preparation workshop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X