అమెరికాలోని బే ఏరియా తెలంగాణ ఎన్నారైలు కుపిర్టినో కాలిఫోర్నియాలో జయశంకర్ సంతాపసభను నిర్వహించారు. జయశంకర్‌కు నివాళులు అర్పించడానికి దాదాపు వంద మంది తెలంగాణ ఎన్నారైలు హాజరయ్యారు. జయశంకర్ మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలంగాణ కోసం జయశంకర్ చేసిన త్యాగాలను వక్తలు నెమరేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని వారన్నారు.
విద్యార్థి దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు జయశంకర్ తెలంగాణ కోసం చేసిన కృషిని వారు కొనియాడారు. జయశంకర్ 1954లో విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారని వారు గుర్తు చేశారు టిడిఎఫ్ ఏర్పాటులో 1999లో జయశంకర్ నిర్వహించిన పాత్రను కూడా వారు గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రాంతీయ అసమానతలపై ఆటా ఆహ్వానం మేరకు 2000, 2002లో అమెరికాలో జయశంకర్ మాట్లాడినట్లు వారు తెలిపారు.