వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కొండవీడు కోట గురించి..

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
కొండవీడు కోట పరిరక్షణకు, ప్రచారానికి కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి నడుం కట్టారు. రెడ్డి రాజులు 14వ శతాబ్దంలో నిర్మించిన కోట తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దాన్ని వెలుగులోకి తెచ్చి పరిరక్షించేందుకు ఆ కమిటీ ఏర్పడింది. ఇందుకు శివారెడ్డి గ్రేటర్ చికాగో తెలుగు కమ్యూనిటీ నాయకులు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు హేమంత్ రెడ్డి, సత్యనారాయణ ఆర్ కందిమల్ల, నరేందర్ ఆర్ చెమర్ల, సత్యనారాయణ ార్ కొండపల్లి, సుందర్ దిట్టకవి, కళ్యాణఅ ఆర్ అనందుల, అమర్ నెట్టెం, రామ్ ఆదె, రవీందర్ రెడ్డి, సుధాకర్ బిజ్జంలను కలిశారు.

మధ్యయుగంలోని సాంస్కృతిక వైభవానికి, చారిత్రక సందర్భానికి ప్రతీక అయిన కొండవీడు కోటను ప్రాచుర్యంలోకి తమకు సహకరించాలని శివా రెడ్డి వారిని కోరారు. దీన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి శివా రెడ్డి 2004 నుంచి కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సహకారంతో ఆయన కొండవీడు కోటపై ఓ డాక్యుమెంటరీని కూడా నిర్మించారు.

శివారెడ్డికి సహకారం అందించేందుకు ఆటా ముందుకు వచ్చింది. కొండవీడు కోట అమెరికాలోని తెలుగు ఎన్నారైల్లో ప్రాచుర్యంలో ఉందని ఆటా తెలిపింది. కొండవీడు గురించి తమ తదుపరి మ్యాగజైన్‌లో వార్తాకథనాన్ని ప్రచురిస్తామని తెలిపింది. ఆటా, టిఎజిసి సభ్యులు కొండవీడు కోటను ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి చేస్తారని చెప్పింది.

English summary
Kalli Siva Reddy, Convener, Kondaveedu Fort Development Committee, Guntur, as part of publicizing, the 14th century impregnable and glorious fortress of Kondaveedu, built by the Reddy rulers, hither to neglected, now brought in to lime light by the efforts of Kondaveedu Fort Development Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X