అమెరికాలో జయశంకర్‌కు యాష్కీ సంతాపం

బుదవారం, జూన్ 29, 2011, 9:52 [IST]
Madhu Yashki in USA to pay homage to Jayashankar
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) న్యూయార్క్, న్యూజెర్సీ చాప్టర్ ఈ నెల 25వ తేదీన ఎడిసిన్ స్టెల్టోన్ బాప్టిస్ట్ చర్చిలో జయశంకర్ సంతాప సభను నిర్వహించింది. ఈ సంతాపసభలో కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, దివంగత ఆచార్యుడు జనార్దన రావు కూతురు వర్ష పాల్గొన్నారు. భగవద్గీత శ్లోకాలు ఆలపించడం ద్వారా జమునా పుష్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిఎఫ్ వ్యవస్థాపకుడు మధు కె. రెడ్డి తమ సంస్థను ప్రారంభించడానికి జయశంకర్ అందించిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ప్రెఫెసర్ జయశంకర్ గురించి మధు యాష్కీ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే జయశంకర్ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి తాను మరింత కృషి చేస్తానని మధు యాష్కీ చెప్పారు. తెలంగాణ సాధించడం ద్వారా జయశంకర్‌కు నివాళి అర్పించడానికి ఎన్నారైలంతా ఏకం కావాలని సుధాకర్ పెర్కారీ సూచించారు. జయశంకర్ కోసం సుద్దాల అశోక్ తేజా రాసిన పాటను హరి ముడుంబ, శ్రవణ్ ఆలపించారు. సురేందర్ మద్ది జయశంకర్ అమెరికా పర్యటనలను గుర్తు చేసుకున్నారు.

తాను కాళోజీని తాత అని, జయశంకర్‌ను అంకల్ అని పిలిచేదాన్ననని వర్ష చెప్పారు. అంకల్ లక్ష్య సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జయశంకర్ జ్ఞాపకాలను పంచుకోవడానికి సమావేశానికి వచ్చిన వారందరికీ టిడిఎఫ్ అధ్యక్షుడు మురళి చింతలపణి కృతజ్ఞతలు తెలిపారు.
English summary
Telangana Development Forum, USA (TDF) New York/New Jersey Chapter held aSanthapa Sabha (Memorial Service) for Prof. Jayashankar on Saturday, June 25, 2011 at Stelton Baptist Church, Edison, NJ. Nizamabad Congress MP Mr. MadhuYashki and late Prof. Janardhan Rao’s daughter Varsha were also attended with many New Jersey residents.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs