వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

By Pratap
|
Google Oneindia TeluguNews

American Telugu Association
అమెరికా తెలుగు సంఘం(ఆటా) డెట్రాయిట్‌లో ఈ నెల 5వ తేదీ ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. అమెరికా రెడ్‌ క్రాస్‌ సహకారంతో ఆటా జూన్‌ 5న స్థానిక మాంటెస్సోరి హాల్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆటా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రామ్‌రెడ్డి, సంస్థ మీడియా ప్రతినిధి లింగాల హరిప్రసాద్‌రెడ్డి, డెట్రాయిట్‌ స్థానిక సమన్వయకర్త మురళీ బొమ్మనవెని, సంస్థ ప్రతినిధులు వినోద్‌ కుకునూరు, నాగేందర్‌ ఐత, రామ్‌చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ శిబిరంలో పాల్గొన్న రక్త దాతలను వీరు అభినందించారు. వచ్చే రెండు నెలల్లో ఇలాంటివి మరో రెండు కార్యక్రమాలను నిర్వహించడానికి 24 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మాంటెస్సోరి హాల్‌ ప్రిన్సిపల్‌ కరెన్‌లుమ్స్‌డెన్‌, ఆనంద్‌ తదితరులకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
American Telugu Association (ATA) organised blood donation camp at Detroit in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X