చికాగో తెలంగాణ సంఘం (చిటా) తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సంస్మరణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నారైలు జయశంకర్‌కు నివాళులు అర్పించారు. ఈ నెల 10వ తేదీన చికాగో శివారులోని నాపెర్‌విల్లేలో ఈ సమావేశం జరిగింది. జయశంకర్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
చికాగోలోని ఓ సదస్సులో జయశంకర్ తెలంగాణపై చేసిన ప్రసంగాన్ని, ఆయన అమేయ ప్రతిభా పాటవాన్ని శ్రీని పాల్తెపు గుర్తు చేశారు. తన 13 ఏళ్ల ప్రాయం నుంచే తెలంగాణ కోసం జయశంకర్ పోరాటం చేస్తూ వచ్చారని ఆయన అన్నారు. జయశంకర్ పాల్గొన్న సదస్సులో తమ అనుభవాలను కిషన్ రెడ్డి, పూర్ణ అల్లంనేని పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం పునాది స్థాయికి వెళ్లడానికి జయశంకర్ చేసిన కృషి గొప్పదని ఆయన అన్నారు.
జయశంకర్ ద్వారా తాము స్ఫూర్తి పొందిన తీరును చిటా సభ్యులు శ్రీనివాస్ ఓరుగంటి, తిరుమల్ నెల్లుట్ల, ప్రదీప్ దామిడి, శ్రీనాథ్ చిన్నాల వివరించారు. వరంగల్లు సికెఎం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ చేసిన విజయేందర్ రెడ్డి జయశంకర్‌తో తనకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు. జయశంకర్ పాల్గొన్న సదస్సు వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా ప్రదర్శించారు.