తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలనే తెలంగాణ ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) అమెరిగా స్వాగతించింది. వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు టిడిఎఫ్ - అమెరికా అధ్యక్షుడు మురళి చింతలపాణి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగవద్దని ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోనివారు ప్రజల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాలకు భయపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గిందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్, అహ్మద్ పటేల్ కాంగ్రెసు తెలంగాణ నాయకులను పదే పదే అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజీనామాలకు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా ముందుకు వచ్చి శానససభలో సంక్షోభం సృష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి త్యాగాలను తెలంగాణ ప్రజలు తరతరాలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు.