న్యూజెర్సీలో తెలుగు సంబరాల సందడి

శనివారం, జూలై 2, 2011, 10:25 [IST]
NRI
అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు సంబరాల సందడి నెలకొంది. న్యూ జెర్సీలో, జూలై 1, 2, 3 తేదిల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తలపెట్టిన సంబరాలకు యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల నుంచి తెలుగువాళ్లు తరలి వస్తున్నారు. అమెరికా తెలుగు చరిత్రలో, అత్యధిక తెలుగు ప్రముఖులు నాట్స్ తెలుగు సంబరాల్లో పాల్గొంటున్నారు.

న్యూ జెర్సీలో తెలుగు మేధావులు,ఆద్యాత్మిక నాయకులు, పాత్రికేయ ప్రముఖులు, గాయనీగాయకులు, సంగీత కళాకారులు, క్రీడాకారులు, కళాకారులు, రాజకీయ నాయకులు, చలన చిత్ర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నృత్య కళాకారులు, జానపద కళాకారులతో సందడిగా ఉంది. తెలుగు సంబరాల్లో ఈ కిందివారు పాల్గొంటున్నారు.

తెలుగు ఆద్యాత్మిక నాయకులు: చిన జీయర్ స్వామి
క్రీడాకారులు: కపిల్ దేవ్
రాజకీయ నాయకులు: పురందేశ్వరి, మనోహన్ నాదెండ్ల, లగడపాటి రాజగోపాల్, డి ఎల్ రవీంద్రా రెడ్డి.
చలన చిత్ర ప్రముఖులు: రాం చరణ్ తేజ, రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ్ రెడ్డి, మధు శాలిని, సునీల్, కృష్ణుడు, కోట శ్రీనివాస రావు, కోట శంకర్ రావు, సౌమ్య రాయ్, ఢిల్లీ రాజేశ్వరి
హాస్య నటులు: గౌతం రాజు, నల్ల వేణు
గాయనీగాయకులు: గజల్ శ్రీనివాస్, ఘంటసాల రత్నాకర్, ఎల్ ఆర్ ఈశ్వరి, తమన్, మాళవిక, గీతా మాధురి, సుమంగళి, కృష్ణ, రేవంత్, వసంత్, సింహ,
కళాకారులు: దీక్షితులు,ఫన్ మాధవ్, ఫ్లూట్ నాగరాజు, గాయత్రి భార్గవి.
English summary
North America Telugu Society (NATS) telugu Sambaralu begin in New Jersey of USA.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs