సెయింట్ లూయిస్‌లో వైయస్సార్ జయంతి ఉత్సవం

మంగళవారం, జూలై 12, 2011, 9:01 [IST]
NRI
వైయస్సార్ యువసేన మిస్సోరీ ఇంచార్జీ పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి 62వ జయంతి ఉత్సవం జరిగింది. వైయస్సార్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించిన తెలుగు ఎన్నారైలు కుటుంబ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్సార్ అభిమానులు తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఓ ప్రకటనలో ఈ విషయం చెప్పారు.

వైయస్ బాల్యం, 60 ఏళ్ల జీవితం, 31 ఏళ్ల రాజకీయ జీవితం వంటి విషయాలతో పాటు పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వంటి అంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అశ్వీర్ రెడ్డి పమ్మి బర్త్ డే కేక్ కట్ చేశారు. వైయస్సార్ సెయింట్ లూయిస్ పర్యటనను సుబ్బారెడ్డి పమ్మి గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించి, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు కోరుకున్నారు.

గోపాల్ రెడ్డి తాటిపర్తి, సాయికృష్ణా రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, కిరణ్ ముల్పూరు, శ్రీకాంత్ తమ తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ముల్పూరు ప్రకాష్, సీతలకు కృతజ్ఞతలు తెలిపారు.
English summary
Anna YSR 62nd birthday celebrations conducted @ St Louis to remember a great leader on his Birthday in Homely atmosphere like celebrating his own family member as all Yuvaena members believe Anna YSR is their family member.
User Comments
Raghu 22 Sep 2011 12:41 am
కీప్ ఇట్ అప్
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs