ఎంఎం నరసింహా రెడ్డి అనే పేద రైతు శస్త్ర చికిత్స కోసం వైయస్సార్ యువసేన అమెరికా కమిటీకి చెందిన ఏడుగురు సభ్యులు 1.02 లక్షల రూపాయల విరాళం అందించారు. నర్సింహారెడ్డికి తమిళనాడులోని వెల్లూరులో శస్త్ర చికిత్స జరుగుతోంది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన నర్సింహా రెడ్డి వైద్యానికి 12 లక్షల రూపాయలు ఖర్చవుతాయని, రాజీవ్ ఆరోగ్య శ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, అయితే ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకు రాలేదని, విషయం తెలిసి తాము ముందుకు వచ్చి రాజన్న ఆరోగ్యశ్రీ ద్వారా కొంత మేరకు సాయం అందించామని వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఓ ప్రకటనలో చెప్పారు.
రైతులను ఆదుకోవడం ద్వారా వైయస్సార్ 62వ జయంతిని సార్థకం చేయాలని అనుకున్నామని, వైయస్సార్ వారసత్వాన్ని కొనసాగించాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. రాజన్న ఆరోగ్యశ్రీ ద్వారా పేదలను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ ప్రతినిధులు ఎంవి నారాయణ రెడ్డి, వాస్కల్లెపల్లి శ్రీనివాస్ 1.02 లక్షల మొత్తాన్ని నర్సింహా రెడ్డి సోదరుడు శ్రీనివాస రెడ్డికి ఈ నెల 30వ తేదీన అందించినట్లు ఆయన తెలిపారు.