భారత విద్యార్థులకు సేఫ్: ఆస్ట్రేలియా

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 10:46 [IST]
Australian  Flag
భారతీయ విద్యార్థులకు తమ దేశంలో ఎలాంటి ముప్పు ఉండదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. తమ దేశంలో విశ్వవిద్యాలయాల్లో చేరే భారత విద్యార్థుల భద్రతకు విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 2010లో జరిగిన ఘటనల అనంతరం భారత విద్యార్థుల భద్రతతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ అధినేత టెడ్‌ బెయిలీ తెలిపారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌, ఆస్ట్రేలియా విద్యా సంస్థలు ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా బెయిలీ మాట్లాడారు. విద్యార్థుల భద్రత విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, భారీ సంఖ్యలో పోలీసులను నియమించి వారికి అదనంగా అధికారాలను సమకూర్చి నిఘాకోసం భారీగా సీసీటీలను ఏర్పాటుచేశామన్నారు. భారతీయులు ఎప్పుడూ నాణ్యమైన విద్యనే కోరుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు.
English summary
Victorian government head said that no threat to Indian student in Australia.
User Comments
Narasimha Thota 27 Feb 2012 10:59 am
అవును మరి. ఇక్కడ లెక్కలేనన్ని గంటలు టాక్సీ నడుపవచ్చు. కాలేజి కి వెళ్ళకుండానే పది వేల డాలర్స్ కట్టి డిప్లొమా డిగ్రి లు కొనుక్కోవచ్చు. ఆ తరువాత అలాంటి కాలేజి ఒకటి వోపెన్ చేసి మిలియనీర్ కావచ్చు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs