లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హైదరాబాద్ విద్యార్థి ప్రవీణ్ రెడ్డి స్పృహలోకి వస్తున్నాడు. లండన్‌లోని తన ఫ్లాట్‌లో జరిగిన దాడిలో 15 రోజుల క్రితం అతను తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి అతను స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చినప్పటికీ అతన్ని వెంటిలేటర్ మీదనే ఉంచినట్లు అతని కుటుంబ సభ్యులు చెప్పారు.
ప్రవీణ్ రెడ్డిని మరో ఆరు రోజుల పాటు వైద్యులు తమ పరిశీలనలో ఉంచుకుంటారు. ఇప్పటికి కూడా అతను మాట్లాడలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి అనే హైదరాబాద్ విద్యార్థిపై నిశాంత్ అనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రవీణ్ రెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి హైదరాబాదులోని ఎల్పీ నగర్‌కు చెందినవాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.