అమెరికాలో కాగజ్‌నగర్ విద్యార్థి మృతి

బుదవారం, ఫిబ్రవరి 15, 2012, 20:29 [IST]
USA
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన పులి రాజేష్ అనే విద్యార్థి ప్రమాదంలో మరణించాడు. టెక్సాస్‌లోని డెనోలాస్‌లో కారు చెట్టుకు ఢీకొనడం వల్ల ఈప ప్రమాదం సంభవించింది. రాజేష్ అమెరికాలోని టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు.

పాతికేళ్ల రాజేష్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రోడ్డు కాస్తా బాగా లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు. టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో అతను ఎంఎస్ చేస్తున్నాడు. నిరుడు సెప్టెంబర్‌లో ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన సుమన్ కుమార్రెడ్డి కుకునూరు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. పులి రాజేష్ ఈ నెలలోనే విశ్వవిద్యాలయంలో చేరినట్లు తెలుస్తోంది.
English summary
GROVETON, TX - Wet road conditions may have played a factor in an East Texas car crash that claimed the life of a Texas A&M University-Commerce student.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs