వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్ టాప్ రెస్టారెంట్‌లో అక్కినేని పోస్టల్ స్టాంప్(ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పద్మభూషణ్, దాదాసాహెచ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో యునైటెడ్ స్టేటెడ్ పోస్టల్ సర్వీస్ సంస్థ అక్కినేనిపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 91వ జన్మదినమైన సెప్టెంబర్ 20న పురస్కరించుకుని డల్లా‌స్‌లోని హిల్ టాప్ రెస్టారెంట్‌లో సాయంత్రం 3.30 గంటలకు స్టాంప్ ఆవిష్కరణ వేడుక జరిగింది.

ఇదే స్టాంప్‌ని డిసెంబర్ 17న గుడివాడలో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

Akkineni Foundation of America (AFA) released ANR US Postal Stamp in USA

(AFA)పేర్కొంది.

ఈ కార్యక్రమంలో ఎఎఫ్ఎ సెక్రటరీ శారత ఆకునూరి మాట్లాడుతూ అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, అక్కినేనికి బాగా సన్నిహితుడు
డాక్టర్ ఎఎస్. నారాయణతో పాటు అక్కినేని నాగేశ్వరరావు మనవడు అక్కినేని ఆదిత్య తదితరులు పాల్గోన్నారు.

ఎఎఫ్ఎ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ "అక్కినేని జీవితం, ఆయన పాటించిన పద్దతులు ఈ కాలం యువ హీరోలకు ఒక పాఠ్యాంశమని అన్నారు. ఆయన హార్డ్ వర్క్, క్రమశిక్షణ, వ్యక్తిత్వం లాంటి నుంచి ఎంతో నేర్చుకోవాలి" అని అన్నారు.

ఇండియాలోనే ఎక్కువ పాఠకులను సంపాదించుకున్న తెలుగు వీక్లీ మ్యాగజైన్ స్వాతితో కలసి వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వ్యాస రచన పోటీలకు 25 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులు. ఈ పోటీల్లో గెలిచిన వారికి డిసెంబర్ 17న కృష్ణా జిల్లా గుడివాడలోని ఎఎన్ఆర్ కాలేజీలో జరిగే అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమంలో రూ. లక్ష ప్ర్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

స్వామివివేకానంద, మహాత్మాగాంధీ, రాజ్ కపూర్ ల లాంటి ప్రముఖుల గౌరవార్ధం గతంలో పోస్టల్ స్టాంప్ లను విడుదల చేసిన అమెరికా ప్రభుత్వం అదే స్థాయిలో గౌరవిస్తూ అక్కినేని పై ఈ స్టాంప్ ను విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. సినిమా రంగానికి అద్భుతమైన సేవలు అందించిన ప్రతిభావంతులను గౌరవించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు ‘ఏయన్నార్ జాతీయ అవార్డు' కి ఈసారి అమితాబ్ ను ఎంపిక చేశారు.

English summary
Akkineni Foundation of America (AFA), a non-profit organization, commemorated the 91st Birthday of Padma Vibhushan, Nata Samrat Dr. Akkineni Nageswara Rao by launching a customized ANR US Postal Stamp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X