వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఆటా’ వేడుకల్లో సినీతారలు ఆడిపాడారు (ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘13వ కాన్ఫరెన్స్-యూత్ కన్వెన్షన్'ను ‘తెలుగు చరిత-యువత-భవిత' పేరిట మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మ సంబరాలను జరిపారు. జులై 3న ప్రారంభమైన ఈ వేడుకలు జులై 6న ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమాలకు సుమారు 8వేలకు పైగా తెలుగు వారితోపాటు ప్రవాసులు పాల్గొన్నారు. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రవాసులకు, ప్రస్తుత, మాజీ ఆటా కార్యకవర్గ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఆటా కార్యవర్గం పురస్కారాలను అందించి సన్మానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రముఖులతోపాటు అమెరికాలోని ప్రవాసులు కార్యక్రమానికి హాజరయ్యారు.

మిస్ యుఎస్ఏ నినా దవులూరి, మిస్ వాషింగ్టన్ డిసి బిందు పామర్థి, మిస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ప్రత్యూష(త్రిష) గూడూరులతోపాటు సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, శ్రియా శరణ్, రిచా గంగోపాధ్యాయ, షియా గౌతమ్ హాజరయ్యారు. సినీ రచయితలు, గాయకులు శ్రీరామచంద్ర, హేమచంద్ర, శ్రావణ భార్గవి, బాల గాయకురాలు ఆశా సింగ్ ఇంగ్లీష్‌లో పాట పాడి ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఆటా వేడుకలు

ఆటా వేడుకలు

మెరికాలోని అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘13వ కాన్ఫరెన్స్-యూత్ కన్వెన్షన్'ను ‘తెలుగు చరిత-యువత-భవిత' పేరిట మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

సినీనటి రిచా గంగోపాధ్యాయ

సినీనటి రిచా గంగోపాధ్యాయ

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మ సంబరాలను జరిపారు.

ఆటా వేడుకలు

ఆటా వేడుకలు

ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మ సంబరాలను జరిపారు. జులై 3న ప్రారంభమైన ఈ వేడుకలు జులై 6న ఘనంగా ముగిశాయి.

హాజరైన ప్రముఖులు, ఎన్నారైలు

హాజరైన ప్రముఖులు, ఎన్నారైలు

ఈ కార్యక్రమాలకు సుమారు 8వేలకు పైగా తెలుగు వారితోపాటు ప్రవాసులు పాల్గొన్నారు. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రవాసులకు, ప్రస్తుత, మాజీ ఆటా కార్యకవర్గ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఆటా కార్యవర్గం పురస్కారాలను అందించి సన్మానించింది.

సినీ ప్రముఖులు

సినీ ప్రముఖులు

మిస్ యుఎస్ఏ నినా దవులూరి, మిస్ వాషింగ్టన్ డిసి బిందు పామర్థి, మిస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ప్రత్యూష(త్రిష) గూడూరులతోపాటు సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, శ్రియా శరణ్, రిచా గంగోపాధ్యాయ, షియా గౌతమ్ హాజరయ్యారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

సినీ రచయితలు, గాయకులు శ్రీరామచంద్ర, హేమచంద్ర, శ్రావణ భార్గవి, బాల గాయకురాలు ఆశా సింగ్ ఇంగ్లీష్‌లో పాట పాడి ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రావు మాధవరం బిజినెస్ సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్నారైలు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన అన్నారు.

ఆటా వేడుకలు

ఆటా వేడుకలు

కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వాలంటీర్లకు, స్థానిక సంఘాలు టిఏజిడివి, టిఎఫ్ఏఎస్, టిఎల్‌సిఏలకు నిర్వాహకులు పరమేష్ భీంరెడ్డి, భువనేష్ బూజల, మాధవ్ మూసర్ల, కృష్ణా ద్యాప, బల్వంత్ కొమ్మిడి, అనంత్ పుజ్జుర్ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పలు పాటలు పాడి అమితంగా ఆకట్టుకున్నారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రావు మాధవరం బిజినెస్ సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్నారైలు ముఖ్య పాత్ర పోషించాలని అన్నారు. మై హోమ్ ఇండస్ట్రీ ఛైర్మన జూపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోని పేద విద్యార్థుల కోసం ఆయన లక్ష డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డేలవేర్ వ్యాలీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించారు.

తెలంగాణ బిజెపి నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, టిడిపి నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రసమయి బాలకృష్ణ, టిపిసిసి స్పోక్స్ పర్సన్ వినోద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి చిదత్మానంద జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాగా, తెలుగు సాహితీ వేత్త సి నారాయణ రెడ్డికి ఆటా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఈ కార్యక్రమంలో ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్, హన్స్ ఇండియా ఇంగ్లీష్ డెయిలీ చీఫ్ ఎడిటర్ కె రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.

బెనక్వెట్ కమిటీ చైర్ రాజేష్ మాదిరెడ్డి, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ భువనేష్ బూజల కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆహ్వానం పలికారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వాలంటీర్లకు, స్థానిక సంఘాలు టిఏజిడివి, టిఎఫ్ఏఎస్, టిఎల్‌సిఏలకు నిర్వాహకులు పరమేష్ భీంరెడ్డి, భువనేష్ బూజల, మాధవ్ మూసర్ల, కృష్ణా ద్యాప, బల్వంత్ కొమ్మిడి, అనంత్ పుజ్జుర్ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

English summary
The presence of film stars, a music concert that mesmerized a relaxed audience, the re-enactment of Bonalu-Bathakamma festival, folk dances, and various panel discussions focusing on different subjects have marked the conclusion of a three-day event conducted by the American Telugu Association (ATA) in Pennsylvania Convention Center, Philadelphia, USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X