వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతన్ని కార్ల దొంగ చంపేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: భారత సంతతికి చెందిన వ్యక్తిని ఓ కార్ల దొంగ చంపేశాడు. తన మెర్సిడీస్ కారును దొంగలించడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు భారత సంతతి వ్యక్తిని అతను హత్య చేశాడు. హర్జీందర్ సింగ్ భూర్జీ (32) అనే వ్యక్తి తన స్నేహితురాలితో వెళ్లినప్పుడు 2011 సెప్టెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున అతన్ని కార్ల దొంగ కత్తితో పొడిచాడు.

బ్రిటన్‌లోని ఇల్‌ఫోర్డులో ఈ సంఘటన జరిగింది. నేరం చేసిన విషయాన్ని రోరి గోర్డన్ లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్టులో అంగీకరించాడు. భుర్జీని తాను కత్తితో పొడిచానని, అయితే చంపాలనే ఉద్దేశం లేదని రోరి అన్నట్లు ఇల్‌ఫోర్డ్ రికార్డర్ రిపోర్ట్ చేసింది.

Car thief admits killing Indian-origin man in Britain

భుర్జిని చంపి, కారును ఎత్తుకుపోయిన సంఘటనలో గోర్డాన్ (23), జే డాన్ ఫీరోన్ (21)లపై అభియోగాలు మోపారు. లండన్ శివారులోని చింగ్‌ఫోర్డులో కారును వదిలేసి వెళ్లిపోయారు. గ్యారేజ్ యజమాని అయిన భుర్జీ 25 ఏళ్ల వాణిజ్య విశ్లేషకురాలు కాజల్ భర్ద్వా ఎదుటే రక్తమోడి చనిపోయాడు.

బాధితుడిని తాను భయపెట్టాలని మాత్రమే చూశానని, అతని స్నేహితురాలు కారు తాళం చెవులు ఇచ్చిందని గోర్జాన్ చెప్పాడు. అతను తనవైపు దూసుకురావడంతో అనుకోకుండా అనూహ్యంగా జరిగిపోయిందని గోర్డాన్ చెప్పాడు.

English summary

 A suspected carjacker in Britain, who stabbed an Indian-origin man to death while he was trying to prevent his Mercedes from being stolen, has admitted to his crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X