వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికురాలికి ముద్దుపెట్టిన కేసులో ఎన్నారైకి జైలు

|
Google Oneindia TeluguNews

Indian man jailed for groping woman on US flight
నెవార్క్: విమానంలో తన తోటి మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ప్రవాస భారతీయుడైన దేవేందర్ సింగ్(62)కి అమెరికా కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్‌లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. రెండు సంవత్సరాలపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు.

గత సెప్టెంబర్‌లో దేవేందర్ సింగ్ హుస్టన్ నుంచి నెవార్క్‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో తన పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో నిద్ర నుంచి మేల్కొన్న సదరు మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.

వెంటనే ఆ మహిళ విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై సిబ్బంది ఎయిర్ పోర్టుకు సమాచారం అందించడంతో విమానం ఎయిర్‌పోర్ట్ చేరగానే పోలీసులు దేవేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ఆ కేసు శుక్రవారం (అక్టోబర్ 24)న విచారణకు వచ్చింది. కేసులో వాదనలను విన్న న్యాయమూర్తి.. దేవేందర్ సింగ్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రెండేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. దేవేందర్ సింగ్ లూసియానాలోని బోటన్ రూగ్‌లో నివాసముంటున్నాడు.

English summary
An Indian man who admitted that he groped a sleeping woman aboard a flight from Houston to New Jersey has been sentenced to eight months in prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X