వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖర్చులు చెల్లించకపోవడంతో ఆస్పత్రిలోనే ఎన్నారై

|
Google Oneindia TeluguNews

Indian man stranded in Dubai hospital over unpaid bills
దుబాయ్: వైద్య ఖర్చులు చెల్లించని కారణంగా ఓ భారతీయుడు దుబాయ్‌లోని ఆస్పత్రిలో చిక్కుకున్నాడు. తన వైద్య ఖర్చులు 1,00,000 దిర్హమ్స్ (27వేల డాలర్లు) ఆస్పత్రికి చెల్లించకపోవడంతో అతడు ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

మాక్స్‌వెల్ డోనాల్డ్ పెరీరా (56) పాక్షిక పక్షవాతం కారణంగా జనవరిలో వైద్య చికిత్స కోసం రషీద్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైద్యులు వైద్య చికిత్స అందించారు. అయితే అతడు వైద్య ఖర్చులు చెల్లించకపోవడంతో అక్కడే నిర్బంధించారని గల్ఫ్ మీడియా తన కథనంలో బుధవారం వెలువరించింది.
ప్రస్తుతం అతని ఆరోగ్యంగా నిలకడగా ఉందని, అయితే అతను స్వయంగా నడవలేడని, ఇతరుల సహాయం లేకుండా ఎటూ వెళ్లలేడని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.

నర్సు సహాయంతో అతను ఇండియా వెళ్లవచ్చని వైద్యులు తెలిపారు. అతనికి పక్కటెముకల సమస్య కూడా ఉందని, అతడు తన సొంత ప్రాంతమైన ముంబైకి చేరుకున్న తర్వాత వైద్య చికిత్స చేసుకోవచ్చని చెప్పారు. ప్రయాణ ఛార్జీలతో కలుపుకుంటే అతని ఖర్చులు 35వేల దిర్హామ్‌లకు చేరుకుంటాయని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అతన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రావడం లేదని, భార్య, కుమారుడు ఇతనికి దూరంగా ఉంటున్నారని చెప్పారు.

అతనికి హెల్త్ కార్డు ఉన్నప్పటికీ తన ఖర్చులను కవర్ చేయలేకపోయిందని తెలిపారు. అతని స్పాన్సర్, రాయ్ పెరీరా యజమాని కూడా రాలేదని చెప్పారు. గత 36ఏళ్లు అతడు దుబాయ్ లోనే ఉంటున్నాడని, బుర్ దుబాయ్ జిల్లాలోని హాలీడే ఇన్‌లోని నమస్తే అండ్ వేగాస్ క్లబ్‌లో సూపర్ వైజర్‌గా డోనాల్డ్ విధులు నిర్వహించేవాడని తెలిపారు. ఒక మిలియన్ దిర్హమ్‌ల అప్పుల కారణంగా ఆ క్లబ్ మూసివేయబడిందని చెప్పారు. కాగా, సహాయం చేయాలని వృద్ధురాలైన పెరీరా తల్లి, అతని స్నేహితులను కోరుతున్నారు.

English summary
An Indian national has been stuck for the past four months in a Dubai hospital owing to non-payment of his medical expenses up to 100,000 dirhams (about $27,000).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X