వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రియురాలి భర్త చెవి కొరికి జైలు పాలయ్యాడు

|
Google Oneindia TeluguNews

Indian-origin man jailed for biting compatriot's ear
వెల్లింగ్టన్: తన మాజీ ప్రియురాలి భర్త చెవి కొరకడంతో ఓ భారత సంతతికి చెందిన యువకుడు కటకటాల పాలయ్యాడు. న్యూజిలాండ్ మీడియా కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గత శుక్రవారం వాదనలు విన్న స్థానిక కోర్టు నిందితుడు అనీష్ రావు(28)కు రెండు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్షను విధించింది.

అంతేగాక అతనికి 500 న్యూజిలాండ్ డాలర్లను జరిమానాగా విధించింది. అక్లాండ్‌లోని తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లి తలుపులను పగులగొట్టినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.

తన మాజీ ప్రియురాలు వికాష్ని అశారి తన భర్త రితేష్ రామ్‌తో పాటు నిద్రిస్తున్న సమయంలో వారింటికి వెళ్లాడు అనీష్ రావు. ఆ తర్వాత వెంటనే రితేష్‌పై దాడికి యత్నించిన అనీష్.. అతని ఎడమ చెవిని కొరికేశాడు. ఆ తర్వాత తన మాజీ ప్రియురాలు అశారి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు.

రామ్ ఎడమ చెవి భాగం రావు కొరకడంతో కొంత భాగం కిందపడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లినప్పటికీ ఆ భాగాన్ని చెవికి తిరిగి అంటించలేమని వైద్యులు చెప్పారు. రామ్ ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అనీష్ రావును అరెస్ట్ చేశారు.

రావు వేధింపులు భరించలేకనే అతడ్ని వికాష్ని వదిలిపెట్టిందని న్యాయవాది తెలిపారు. అయినప్పటికీ వెంటపడి ఆమెను వేధిస్తున్నాడని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని చెప్పారు. ఇప్పటికే మూడు సార్లు అశారి-రామ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు అనీష్ ప్రయత్నించాడని తెలిపారు.

English summary
An Indian-origin man has been jailed and fined for biting off his former lover's new partner's ear in New Zealand, media reported on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X