వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలిని చితకబాదిన సిఈఓకు ‘శిక్ష’

|
Google Oneindia TeluguNews

Indian-origin tech CEO ducks jail despite beating girlfriend 117 times
వాషింగ్టన్: తన ప్రియురాలును చితకబాదిన కేసులో అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన వ్యక్తి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. దాడికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ అతనికి జైలు శిక్ష పడలేదు. అయితే జైలు శిక్ష తప్పింది కానీ శిక్ష మాత్రం తప్పలేదు.

కేసు పరిశీలించిన అక్కడి న్యాయస్థానం మూడేళ్లపాటు నిందితుడు పోలీసుల పరిశీలనలో ఉండాలని తెలిపింది. అంతేగాక 52 వారాల్లో డొమెస్టిక్ వాయిలెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం, 25 గంటలపాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించింది. హాఫింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. నిందితుడు గుర్బక్ష్ ఛహల్ రేడియంవన్ సంస్థకు సిఈఓగా వ్యవహరిస్తున్నాడు. అతడు ఒక సమయంలో అమెరికాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కూడా రికార్డుల్లోకెక్కాడు.

అయితే తనను మోసం చేసిందనే ఆరోపణలతో తన ప్రియురాలిపై ఛహల్ దాడికి దిగాడు. 30 నిమిషాల్లో 117 సార్లు ఆమెను చితకబాదాడు. ఈ ఘటన సెక్యూరిటీ కెమెరాల్లో కూడా క్లియర్‌గా రికార్డయ్యింది. దీంతో బాధితురాలు 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఛహల్‌ను అరెస్ట్ చేశారు.

కాగా, ఛహల్‌ను మోసం చేసిన కారణంగానే అతడు ఆమెపై దాడికి పాల్పడ్డాడని అతని తరపు న్యాయవాది శాన్ ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టుకు విన్నవించాడు. న్యాయమూర్తి బ్రెండన్ కాన్రయ్ ఆ వీడియో ఫుటేజి న్యాయబద్ధంగా తీసుకున్నట్లు లేదని, అందుకే దాన్ని అంగీకరించమని పేర్కొన్నట్లు తెలిపాడు. నిందితుడు కావాలని దాడికి పాల్పడలేదని, ఆవేశంలోనే దాడి చేశాడని న్యాయవాది కోర్టుకు తెలిపాడు.

English summary
An Indian origin man in the US has reportedly beaten his girlfriend and despite video evidence of the act, he did not face any jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X