వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ (పిటిఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వెస్ట్ చెస్టర్‌లోని స్టేట్సన్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో మే 31 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపినట్లు పిటిఏ సభ్యులు తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన నేపథ్యంలో తాము ఎంతో ఆనందంగా ఉత్సవాలను జరిపినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రపై రూపొందించిన వీడియోలను ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రామానికి సుమారు 500 మంది తెలంగాణ ప్రవాసాలు హాజరైనట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు, మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ పండగ బతుకమ్మ పాటలను పాడారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, సినీ నటుడు శివారెడ్డి చేసిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది.

Philadelphia Telangana Association celebrated T day

తెలంగాణ ఫోక్ సింగర్, టీవీ నటుడు రవి చకటి (రేలా రే రేలా ఫేం) తన పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు తెలుగు సంఘాలైన ఆటా, తానా, నాటా, టిఏజిడివి, ఎన్‌జెటిఏ, హెచ్‌టిఏ, టిడిఎఫ్, టిఈఎన్ఏ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రవాసాలు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెంకట్ మడిపడగ, హరి బండిగారి, శ్రీధర్ గుడాల, సురేష్ వెంకన్నగారి, రాజ్ కక్కెర్ల, సత్య పెద్దిరెడ్డి, మల్లిక్ బొళ్ల, నరేందర్ ఆకుల, శ్రీధర్ తాడూరు, రఘు వడ్ల, రాజేష్ ఈసారపులు ఘనం నిర్వహించారు.

English summary
Philadelphia Telangana Association (PTA) successfully organized Telangana State Formation Day Celebrations with Banquet Night on May 31, 2014 and Main Event on June 1, 2014 - 2.30 pm EST (June 2, 2014 12 AM IST, the exact time Telangana state has formed), at Stetson middle school auditorium, West Chester, PA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X