వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్: తానా ఆధ్వర్యంలో బ్యాగుల విరాళం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

TANA donated school Bags supplies to kids in Dallas
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్త ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలోని పలు పాఠశాలల్లోని 600 మంది విద్యార్దులకు స్కూలు బ్యాగులను విరాళంగా అందజేశారు.

విరాళ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఫోర్ట్ వర్త్ నగర మేయర్ జెట్సీ ప్రైస్ మాట్లాడుతూ
పేద విద్యార్దులకు బ్యాగులు అందజేస్తున్న తానా, టాంటెక్స్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు చేయూతనందించిన దాతలకు, తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌కు ప్రాంతీయ ప్రతినిధి డాక్టర్ అడుసుమిల్లి రాజేష్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, బ్యాక్ ప్యాక్ కార్యక్రమ రూపకర్త డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ, డైరెక్టర్ బోర్డు సభ్యుడు యలమంచిలి రాం, ఫౌండేషన్ కోశాధికారి కన్నెగంటి మంజులత, బ్యాక్ ప్యాక్ కార్యక్రమ ఛైర్మన్ నార్నె రాం, తానా కార్యవర్ద సభ్యులు వెన్నం మురళి, పోలవరపు శ్రీకాంత్, టాంటెక్స్ సభ్యులు నరసింహారెడ్డి, చిన్న సత్యం తదితరులు పాల్గోన్నారు.

English summary

 Telugu Association of North America (TANA) along with the Telugu Association of North Texas (TANTEX) has donated 600 backpacks and school supplies like notebooks, pens, pencils, crayons, folders and glue sticks to needy school children in the Dallas-Fort Worth Metro area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X