వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో పెరిగిన భారత విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

US sees dramatic surge in graduate applications from India
వాషింగ్టన్: అమెరికాలో విద్యనభ్యసించాలని కోరుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అమెరికా గ్రాడ్యుయేట్ స్కూల్స్‌లో చదివేందుకు భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. 2013లో భారతీయ విద్యార్థులు చైనా విద్యార్థుల కంటే ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు దాఖలు చేసినట్లు కౌన్సిల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్కూల్స్ (సిజిఎస్) తన కొత్త నివేదికలో వెల్లడించింది. 32శాతం అధికంగా అప్లికేషన్లు వచ్చినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇది అమెరికాలో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థుల సంఖ్యలో 18శాతంగా ఉంది.

కాగా, చైనా విద్యార్థుల అప్లికేషన్లు 1 శాతం క్షీణించాయి. అమెరికాలో చదువుకునే ప్రతీ ముగ్గురు విదేశీ విద్యార్థులలో ఒకరు చైనా వారు ఉండటం గమనార్హం. 2014లో అమెరికాకు ఇతర దేశాల నుంచి వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 2014లో 7శాతం పెరిగింది. సిజిఎస్ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ సర్వే ప్రకారం ఇది 2013తో పోల్చితే 2శాతం పెరిగింది. 2006 నుంచి 2012 వరకు విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వచ్చిందని సర్వే తెలిపింది. అది 9/11 దాడి తర్వాత కొంత మేర తగ్గిందని పేర్కొంది.

అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిలో చైనా, ఇండియా, దక్షిణ కొరియా, తైవాన్, కెనడాలకు చెందిన విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారని నివేదిక వెల్లడించింది. చైనా, ఇండియా, దక్షిణ కొరియా, తైవాన్, కెనడా, మెక్సికో, బ్రెజిల్, మిడిల్ ఈస్ట్, అఫ్రికా, యూరోప్ లాంటి దేశాలు, ప్రాంతాల వారీగా విద్యార్థుల వివరాలను పరిగణలోకి తీసుకుందీ సర్వే. ఏడు దేశాలు, మూడు ప్రాంతాలు నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికాలో 86శాతం ఉన్నారని తెలిపింది.

సిజిఎస్ అధ్యక్షురాలు దెబ్రా డబ్ల్యూ. స్టువర్ట్ మాట్లాడుతూ.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 7శాతం పెరగడం మంచి పరిణామమని చెప్పారు. అంతేగాక ఇది 15శాతం విదేశీ విద్యార్థులను ఆకర్షించిందని తెలిపారు. ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని ఆమె చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ విద్యా విధానం, నాణ్యమైన వసతులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని ఆమె తెలిపారు.

ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫిజికల్, ఎర్త్ సైన్స్, బిజినెస్ అంశాల్లో 64 శాతం విదేశీ విద్యార్థులు అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో చేరినట్లు తెలిపారు. ఈ రంగాల్లో వరుసగా 14శాతం, 16శాతం, 7శాతం అప్లికేషన్లు పెరిగినట్లు చెప్పారు. 2014లో ఆర్ట్స్, హ్యుమనిటీస్ ప్రోగ్రామ్స్‌లో 3శాతం, ఇతర అంశాల్లో 2శాతం అప్లికేషన్లు పెరిగినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్‌లో 1శాతం, లైఫ్ సన్సెస్‌ ప్రాగ్రామ్స్‌లో 6 శాతం అప్లికేషన్లు తగ్గినట్లు పేర్కొన్నారు.

English summary

 Applications from prospective Indian students to US graduate schools surged dramatically while those from China slowed down a bit in 2013, according to a new report from the council of graduate schools (CGS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X