దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఔన్నత్యం, పరిపాలన తీరు తదితర విషయాలపై తమ అనుభూతులను అనుభవాలను పంచుకోగోరే వారు తమ కవితలను రాసి పంపితే వాటిని అన్నిటిని కలిపి ఓ బృహత్ సంకలనంగా తీసుకువచ్చే కృషికి చిత్తూరుజిల్లా కుప్పంలోని ద్రవిడ యూనివర్పిటీ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి నుంచి కవితలను ఆహ్వానించి వచ్చిన వాటిలో ఎంపిక చేసిన వాటిని తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లోకి కూడా అనువదింపజేసి ప్రచురిస్తారు. మహానేత వైఎస్ఆర్ కు ఆ విధంగా అక్షరాంజలి ఘటించేందుకు కవులు, ఔత్సాహికులు ముందుకు రావాలని ద్రవిడ యూనివర్సిటీ వీసీ రమణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు పత్రికల్లో వచ్చిన కవితలను మళ్లీ దీనికోసం పంపదలచిన రచయితలు ఒక అనుమతిపత్రం ఇవ్వాలని ఆయన తెలిపారు. కవితలను పది రోజుల్లో 'వైస్ ఛాన్స్ లర్, ద్రవిడ యూనివర్సిటీ, శ్రీనివాసవనం, కుప్పం-517245 అనే చిరునామాకు పంపాలని ఆయన కోరారు.