ఇందిరా గోస్వామి, అస్సామీల గుండె చప్పుడు

మంగళవారం, నవంబర్ 29, 2011, 10:59 [IST]
Indira Goswami
ప్రస్తుత సంక్షోభ వాతావరణంలో అస్సామీలకు పెద్ద దెబ్బే తగిలింది. ఈశాన్య రాష్ట్రాలు మిగతా భారతదేశ సమాజంతో పోలిస్తే వివక్షకు గురవుతున్నాయనే అభిప్రాయం ఉంది. అస్సామీలుగా తమ ప్రత్యేకతను, విశిష్టతను చాటుకుంటూ భారత సమాజంతో మమేకం కావాలనే తపనను నిండు హృదయంతో ఆవిష్కరిస్తూ వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికా ఇటీవలే కన్నుమూయగా, ఇప్పుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి ఈ లోకాన్ని తన కొనగోటితో తన్నేస్తూ వెళ్లిపోయారు. జీవితంలో డిప్రెషన్‌ను అధిగమించి, ఆత్మహత్య చేసుకోవాలనే కోరికను దిగమింగుతూ జీవించడానికి రచనలు చేసిన ఇందిరా గోస్వామి తన రచనల్లో జీవనశ్వాసను ఒంపారు. జీవించడానికే తాను రచనలను చేశానని చెప్పుకున్న గోస్వామి తన రచనల్లో అస్సామీ సమాజం గండెను ఆవిష్కరించారు. ఆమె తన రచనల్లో మహిళలకు, అస్సామీ సమాజ సాంస్కృతిక, రాజకీయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. అస్సామీ సాహిత్యంలో అత్యంత ఉత్తమమైన పురుష పాత్రను చిత్రీకరించిన ఘనత కూడా ఆమెకు దక్కుతుంది. దతాల్ హంతీర్ ఉనే ఖోవా హౌడాలో ఇంద్రనాథ్ పాత్ర సాహిత్య విమర్శకుల మన్ననలు అందుకుంది.

అస్సాం భాషలోని విభిన్నతల మధ్య సామాజిక, సాంస్కృతిక రాజకీయాలపరంగా సంబంధాలకు ప్రత్యేకతను ఇస్తూ అస్సామీ సామాజిక వర్గాలను చిత్రీకరించారు. అయితే, మొత్తంగా అస్సామీల ఉనికిని ఆమె చాటి చెప్పారు. మిలిటెంట్ తిరుగుబాటు నేపథ్యంలో జాతిపర సంఘర్షణలను పరిష్కరించడానికి సమకాలీన రాజకీయ స్వభావాన్ని ఆమె చిత్రీకరించగలిగారు. ఆ కారణంగానే ఆమె కేంద్ర ప్రభుత్వానికి, ఉల్ఫా తిరుగుబాటుదారులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించగలిగారు. ప్రజా సంప్రదింపుల గ్రూప్ అనే పీస్ కమిటీ ఏర్పాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. తాను మధ్యవర్తిని కాదని, పరిశీలకురాలిని మాత్రమేనని ఆమె చెప్పుకునేవారు. ది మోత్ ఈటెన్ హౌడా ఆఫ్ ఎ టస్కర్‌తో పాటు పేజేసే స్టెయిన్‌డ్ విత్ బ్లడ్, ది మ్యాన్ ఫ్రమ్ చిన్నమస్తా అనే అద్భుతమైన రచలను చేసి, సామాజిక పరివర్తనకు కృషి చేశారు. వర్డ్స్ ఫ్రమ్ ది మిస్ట్ అనే పేరుతో జహ్నూ బారువా ఆమె జీవిత కథను తెరకెక్కించారు.

చిన్ననాటి నుంచే ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే విచిత్రమైన కాంక్ష ఉంటూ వచ్చింది. ఇది ఆమె ఆత్మకథ ది అన్‌ఫినిష్‌డ్ ఆటోబయోగ్రఫీ (అసంపూర్ణ ఆత్మకథ) ద్వారా తెలుస్తుంది. షిలాంగ్‌లో తన ఇంటికి దగ్గరగా ఉన్న క్రినోలైన్ జలపాతంలోకి దూకాలని అనిపించేదట. తన భర్త మాధవన్ రైసోమ్ అయ్యంగార్ ప్రమాదంలో మరణించడం ఆమెను విపరీతంగా కృంగదీసింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఆమె భర్త కాశ్మీర్‌లో కారు ప్రమాదంలో మరణించాడు. మొదట్లో రచనలు చేసి మానేసిన ఇందిరా గోస్వామి భర్త మరణం తర్వాత మళ్లీ రచనలు చేయడం ప్రారంభించారు. తన భర్త ఉద్యోగం చేసిన కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన అనుభవాన్ని ఆమె అహిరోన్, ది చెహ్నాబ్స్ కరెంట్ రచనల్లో చిత్రీకరించారు. పరిశోధకురాలిగా, రచయిత్రిగా ఆమె తన రచనల్లో అస్సామీ తిరుగుబాటు ఉద్యమాలను కూడా స్పృశించారు. ఆమె రాసిన కొన్ని రచనలు వివాదాలు సృష్టించాయి. ఓ సంపాదకుడు ఆమె ఘెరావ్ చేశాడు, ఆ తాంత్రికుడు బెదిరించాడు. ఆమె రాసి జాతర భారత ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మిలిటెంట్ ఉద్యమాలను ఇతివృత్తంగా తీసుకుని రాసింది. ఇది ఆమె రచనల్లో ప్రధానమైంది. రచనలు చేయకపోతే జీవించడం సాధ్యమయ్యేది కాదని భావించి రచనలు చేసిన ఇందిరా గోస్వామి అస్సామీ ప్రజలను వదిలేసి వెళ్లిపోయారు. ఆమె మరణం భారత సాహిత్యానికి కూడా తీరని లోటు. ఆమె ఆశించిన సమాజాన్ని సాధించడానికి కృషి చేయడమే ఆమెకు మనం అర్పించగల నివాళి.
English summary
Indira Goswami received the Sahitya Akademi Award (1982). She received the Jnanpith Award (2000), India's highest literary award, for writing about the subalterns [clarification needed] and marginalized. Two of the main features in Goswami's writing has been the focus on women and the cultural and political construct of the Assamese society.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs