అమెరికాలో తెలుగు కవితా సాక్షాత్కారం

సోమవారం, అక్టోబర్ 24, 2011, 8:30 [IST]
Talk on Telugu poetry in USA
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 51వ సదస్సు ఆదివారం, అక్టోబరు 16 వ తేదీ స్థానిక కోకిల రెస్టారెంటు, లుయిసువిల్లో మల్లవరపు అనంత్ అధ్యక్షతన జరిగింది. డల్లాస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికివిచ్చేసారు. ముందుగా ప్రముఖ కళాకారుడు శ్రీ రామాచారిగ శిక్షణలో తాము నేర్చుకున్న 'సరిగమప సంగీత స్వరాలే' అన్న గేయాన్ని చిన్నారి బాలలు రమిత, కీర్తి, అభిరామ్, ధీమంత్, హర్షిత్ రాగయుక్తముగా ఆలాపించి సభకులను విశేషముగా అలరించారు.

పిమ్మట కాజ సురేశ్ ఇటీవల స్వర్గస్ధులైన సినీ గేయరచయిత, జానపద జాలాదిగా ఖ్యాతినందిన  శ్రీ జాలాది రాజారావుని స్మరిం వారి పాటల ప్రాశస్త్యాన్ని సభికులకు వివరించారు. శ్రీ డి.వి.వి.యస్ మూర్తి తెలుగు పద్య కవులలోని "రెడి విట్" ను ప్రస్తావిస్తూరాయలవారి భువనవిజయ సభలను, అష్టదిగ్గజాల సద్యో స్ఫూర్తిని కొనియాడారు. తరువాత కన్నెగంటి చంద్ర, ప్రముఖ సంపాదకులు రచయిత శ్రీ నండూరి రామ్మోహన రావుని స్మరిస్తూ, వారి రచనలను జీవిత విశేషాలను సోదాహరణంగా వివరించారు. పిమ్మట పాలూరి సుజన తమ తల్లి చీర్ల రత్నమాంబ వ్రాసిన జ్ఞపకాలు అనే కవితను చదివి వినిపించారు.

తేనీటి విరామం తర్వాత ముఖ్య అతిథి మద్దుకూరి చంద్రహాస్ ని మల్లవరపు అనంత్ సభకు పరిచయం చేస్తూ ఆయన సాహిత్యాభిలాషను, కవితలను కొనియాడారు. తరువాత 'కవితా సాక్షాత్కారం' అనే అంశంపై ముఖ్యఅతిథి ప్రసంగించారు. కవిత్వం పుట్టే తీరు, దాని నిర్వచనం, అవసరమైన సామాగ్రి, అవలంబించవలసిన పద్దతిని అతి సరళమైన భాషలో వివరించారు. శ్రీశ్రీ, తిలక్, కృష్ణశాస్త్రి, కరుణశ్రీల కవితలను ఉదహరిస్తూ నిజమైన కవిత్వమంటే ఏమిటి, కవి ఏమి చెయ్యాలి లాంటి ఎన్నో విషయాలను హాస్యభరితంగా వివరిస్తూ సభికులను విశేషంగా అలరించారు.  కవిత్వమనేది ఆల్కెమీ అంటూనే సరైన ప్రేరణ, పరిస్తితులు ఉంటే దానిని సాధించటం అంత బ్రహ్మవిద్య కాదేమో అని అభిప్రాయపడ్డారు. పిమ్మట  'వెన్నెల వెతలు', 'అశాంతి', 'ఒక రాత్రి' అనే తమ స్వీయ రచనలను సభికులకు వినిపించి తమ ప్రసంగాన్ని ముగించారు. 

తెలుగు సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యులు, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు సంయుక్తంగా ముఖ్య అతిథిని ఙ్ఞాపికతో సన్మానించారు. ఆఖరుగా సాహిత్య వేదిక సమన్వయ కర్త మల్లవరపు అనంత్  కోకిల రెష్టారెంటు యాజమాన్యానికి  కృతఙ్ఞతలు తెలియ జేసి సభను ముగించారు.

English summary
Tantex has organized a talk on Telugu poetry on its program Nela nela Vennela.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs