ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య సదస్సు నెల నెలా తెలుగు వెన్నెల సాహితీ సదస్సు ఈ నెల 20వ తేదీన లాయిస్విల్‌లోని కోకిల ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగింది. సాహిత్య వేదిక అధిపతి మల్లవరపు అనంత్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. చిన్నారి పరశు తన్మయి ముందుగా భజేహం అనే ప్రార్థనా గీతం ఆలపించింది. సుమతీ శతక పద్యాలను కూడా ఆలపించింది. మార్చి 19వ తేదీన టెక్సాస్‌లో జరిగి 26వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు విశేషాలను మద్దుకూరి చంద్రహాస్ వివరించారు.
స్వీయ రచనలు, సాహితీ వ్యాసంగంలో భాగంగా కార్యవర్గ సభ్యులు జువ్వాడి రమణ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం మీద పద్యం ఆధిపత్యాన్ని వివరించారు. తడిమెట్ల కళ్యాణి మనసు పలికే మనోహరం అనే స్వీయ కవిత వినిపించారు. కన్నెగంటి చంద్ర రాసిన వాన వెలిసిన సాయంత్రం కవితను నసీం షేక్ చదివి వినిపించారు. తెనేటీ విరామం తర్వాత రెండో భాగం సాహితీ సదస్సు ప్రారంభమైంది.
ముఖ్య అతిథి భండారు ఉమా మహేశ్వర రావు సాహితీ సేవను మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేశారు. ఆయన రాసిన నాటికల గురించి, నృత్య రూపాకాల గురించి వివరించారు. వరంగల్లు జిల్లా వాస్తవ్యుడైన ఉమా మహేశ్వర రావు గురించి వరంగల్లులో పుట్టి పెరిగిన డల్లాస్ వాసి శామ్ థామస్ మరిన్ని విశేషాలు చెప్పారు.
తెలుగు సాహిత్యం - నాటక రంగం అనే అంశంపై భండారు ఉమా మహేశ్వర రావు ప్రసంగించారు. పూరాణాలల్లోని పద్యాల నుంచి ఈనాటి గద్యాల వరకు తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పులు, వాటి వల్ల నాటక రంగం ప్రభావితమైన తీరును ఆయన కూలంకషంగా వివరించారు. ఉమామహేశ్వర రావును టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి, ఉపాధ్యక్,ుడు సురేష్ మండువ సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు నసీం షేక్, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, నరసింహా రెడ్డి ఊరిమిండి సంయుక్తంగా ఉమా మహేశ్వర రావును సత్కరించారు.