ఒక స్వాప్నికుడి సంభాషణ

శుక్రవారం, డిసెంబర్ 2, 2011, 11:06 [IST]
K Srinivas
(ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ కాలమ్‌గా రాసిన రచనల్లోంచి కొన్నింటిని ఏరి కూర్చి పర్‌స్పెక్టివ్ సంస్థ సంభాషణగా పుస్తక రూపంలోకి తెచ్చింది. ఇందులోని శ్రీనివాస్ రచనల గురించి ప్రముఖ సాహితీవేత్త వేమన వసంతలక్ష్మి కొన్ని అక్షరాలు రాశారు. వాటిని పుస్తకం చివరి అట్ట మీద అచ్చేశారు. వాటిని తెలుగు పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాం.)

ఒక స్వాప్నికుడి సంభాషణలో ఏమున్నాయో ఎలా చెప్పడం? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోవడానికి ఒక భావుకుడూ విమర్శకుడూ కలిసి తీస్తున్న పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం?

కలల దారులు... నిజాలు నమ్మకాలు. ... ఆశలు అద్భుతాలు... నిరసన ధిక్కారాలు... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావల్సినన్ని కవిత్వ పాదాలు, గొంతు చించుకోగలిగినన్ని నినాదాలు, రంఠతా పెట్టగలిగినన్ని సుభాషితాలు, కళ్లు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగి ఆగి వెళ్లండి. వీలైనన్ని మజిలీలు చేయండి. పైనున్న నగిషీలతో పాటు కాళ్ల కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేదాకా వెతకండి. అది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరకు తీసుకుని వెళుతుంది. అద మరిచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది.

మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడడమే సంభాషణకు కొత్త అర్థం. ఈ సాహసం చేసినందు వల్లే ఈ అక్షరాలు, ఆలోచనల వల్ల మనకు ఇంత మోహం.

English summary
Journalist and critic Vemana Vasantha Laxmi spoke about Andhrajyothy editor K Srinivas's Sambhashana.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs