కన్నడ రచయితకు సినారె అవార్డు

శనివారం, జనవరి  21, 2012, 10:26 [IST]
C Narayana Reddy
కన్నడ రచయిత కవిరత్న మార్కండాపురం శ్రీనివాసులుకు 2011 సంవత్సరానికి సంబంధించి డాక్టర్ సినారె సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సినారె కళాపీఠం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికను అందజేస్తారు.

ఈ నెల 24వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జస్టిస్ టి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ సి నారాయణరెడ్డి, ప్రొఫెసర్ ఎన్ గోపి, డాక్టర్ వాకా వాసుదేవరావులు పాల్గొంటారని తెలియజేశారు.
English summary
Kannada Writer Markandapuram Srinivasulu got Cinare Award for the year 2011.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs