వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాశరిథికి కెసిఆర్ పెద్ద పీట (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మా నిజాం తరతరాల బూజు అని, ముసలి నక్కకు దక్కునే అంటూ నిజాం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దాశరథికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన దాశరథి జయంతి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొని నివాళులు అర్పించారు.

దాశరథి గొప్పతనాన్ని కెసిఆర్ కొనియాడారు. దాశరథి తిమిరంతో సమరం చేశాడని ఆయన అన్నారు. దాశరథి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు. దాశరథి పేర యేటా ఓ ఉత్తమ కవిని సత్కరిస్తామని చెప్పారు. దాశరథి కుమారుడికి ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అదే సమయంలో తెలుగు సంస్కారాన్ని, సాహిత్యాన్ని నిలబెట్టాలని ఆయన సాహితీవేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాహిత్యాన్ని హిమాలయ శిఖర స్థాయిలో నిలబెట్టాలని ఆయన చెప్పారు. తనకు సాహిత్యం పట్ల ఉన్న అభిరుచిని వెల్లడించారు. రాజకీయాల కారణంగా సాహిత్య గోష్టులకు దూరం కావడం తనకు బాధగా ఉందని కూడా చెప్పారు.

దాశరథికి నివాళి

దాశరథికి నివాళి

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కవి దాశరథికి నివాళులు అర్పించారు.

దాశరతి జయంతి సభలో ఇలా..

దాశరతి జయంతి సభలో ఇలా..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాశరథి జయంతి కార్యక్రమంలో ఇలా కనిపించారు. ఈ కార్యక్రమం మంగళవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది

దాశరథి పేర అవార్డు

దాశరథి పేర అవార్డు

ప్రముఖ కవి దాశరథి పేర యేటా తెలంగాణకు చెందిన ఓ ఉత్తమ కవిని లక్ష రూపాయల నగదు బహుమతితో సత్కరిస్తామని కెసిఆర్ చెప్పారు

గురువుకు నమస్కారాలు..

గురువుకు నమస్కారాలు..

దాశరథి జయంతి కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న తన గురువు తిరుమల శ్రీనివాస రావును కెసిఆర్ కొనియాడారు. తిరుమల శ్రీనివాస చార్యులుకు దాశరథి అత్యంత సన్నిహితంగా ఉండేవారు.

దాశరథిపై పుస్తకం

దాశరథిపై పుస్తకం

దాశరథిపై వచ్చిన పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవిష్కరించారు. ఆయన ఇరు వైపులా తిరుమల శ్రీనివాసాచార్య, ప్రభుత్వ సలహాదారు రమణాచారి

English summary
Telangana CM K Chandrasekhar Rao participated in Dasarathi birth day anniversary and announce award on the name of Dasarathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X