అన్నవరం కవిత ఆపతి సంపతి

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012, 13:48 [IST]
Annavaram Devender
మనిషి కనిపిస్తే
మనస్సు మాటలు కలుపుతది
తెల్సిన వాళ్లయితే కరచాలన స్పర్శ

పాత స్నేహితుని గొంతు
వినీ వినగానే
విశాలమైన హృదయ వైశాల్యం

కాలనీ తరచూ కల్సుకునే
అపరిచయస్థుల కనుపాపల పలకరింపులు
స్నేహం చిక్కనైన కొద్దీ
పరస్పర నమస్కారాలు

మనిషంటే ముఖవర్చస్సు
లేదా పెదవుల మది చిరునవ్వు
మనిషి ఒక మాట ముచ్చట

మనుషులు లేని ఇల్లు ఓ ఇల్లేనా
పూలు ఫలాలు లేని తోట తోటేనా

మనిషే మనిషికి సోపతి
ఆపతి సంపతి

- అన్నవరం దేవేందర్
English summary
Annavaram Devender says in his poem about the importance of human relations.
User Comments
Gullakota Laxman 26 Mar 2012 07:16 pm
పూలు ఫలాలు లేని తోట తోటేనా మనిషే మనిషికి సోపతి ఆపతి సంపతి అద్భుతం దేవేందర్ గారు ....
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs