ఒకానొక ప్రేమ కవిత

శుక్రవారం, జనవరి  6, 2012, 20:11 [IST]
Kasula Pratap Reddy
నీళ్లు లేని చోట
నా నెత్తురు వాగులై పారుతుంది
చాలాసార్లు
చావుదాకా పోయి తిరిగి వస్తుంటా
మరణించిన ప్రతిసారీ
పునర్జన్మ ఎత్తుతా
అమ్మ గుండెల మీద ఆడుతున్న
పసిపోరన్ని నేను
ఎండిపోయిన పాలిండ్లు
ఎల్తి గరిశెలు
అమ్మ కన్నీరు మంచు శిలలవుతూ
నా చెంపలపై రాలి పడుతూ ఉంటయి
జీవితం
చుక్క చుక్కా జుర్రుకునే మద్యం
ఏదీ అంతం కాదు
నీ రాక కోసం
తలుపులూ తెరిచే ఉంటాయి
బుద్ది ఎటు పోతుంది
లోపల గడియ వేశారనుకుంటావు
పిచ్చోడివో ఎర్రోడివో
జీవితం రుచి తెలియనివాడివో
లెక్కలూ పత్రాలూ ఉండవు
మాయలూ మర్మాలూ ఉండవు
గుండె ఒక్కటే ఉంటది
నీకు లేనిదీ నాకు ఉన్నదీ అదొక్కటే
రా, తలుపులూ తలంపులూ తెరిచే ఉన్నాయి
నెత్తురు రుచి మరిగినవాడా
నా నెత్తురు ధారలై పారుతున్నది
మోదుగాకు డొప్ప పట్టు
నీకు మద్యం, మగువ, మత్తు
అంతా నా నెత్తురే కదా
రిజర్వాయర్ల నిండా పట్టుకో
దఫాలు దఫాలుగా జుర్రుకో
సిగ్గుసెరం లేనోడా
నా మొల్దారాన్ని దండెం కట్టి
నా కండకండనూ దోర్నాలు కట్టినోడా
నీ కన్నా పసురం మేలు

- కాసుల ప్రతాప రెడ్డి
English summary
Poet Kasula Pratap Reddy depicted in his poem about the injustice done to the society.
User Comments
Vijayabhaskar Haripuri 20 Jan 2012 11:09 pm
naku samadhanam pampadi
Vijayabhaskar Haripuri 20 Jan 2012 11:07 pm
naloli alajadi matalaku andhani chupula jevanakanshalanu repala poothilalo karigisthu apithiga alambhana koraku adiri chusthuna akaki pakshi la nenu jivesthunanu
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs