ఎన్ అరుణ ఆలాపన

మంగళవారం, జనవరి  24, 2012, 19:32 [IST]
Telugu Literature
పక్షులు డ్రీమీగా కదులుతున్నాయి
మెత్తటి గాలి
ఖాళీ జ్ఞాపకాలను మోసుకొస్తుంది
నా చిన్నప్పటి రూపం
నా వెంట నడిచొస్తున్నట్టే వుంది
మెలుకువ
ఒక దీర్ఘరాత్రిగా మారింది

సముద్రంలో అల వెనక్కి పోయినట్లు
కాలం వెనక్కి వస్తే బాగుండు
నిన్నని రేపుగా చేసే ప్రయత్నంలో
నన్ను నేను
ఒక ఆయుధంగా మలుచుకుంటున్నాను

ఆ పొద్దు తిరుగుడు పూలన్నీ
సూర్యుడికి నిబద్దాలే
ఒక్కటి మాత్రం
ఏమయ్యిందో గాని
మొహం తిప్పుకుంది
ఇప్పుడది నా వైపు చూస్తుంది
కాబట్టి
అది నాదే
English summary
Prominent poetess N Arun depicts about the memories depth.
User Comments
RaviChandra 25 Jan 2012 04:43 pm
సముద్రంలో అల వెనక్కి పోయినట్లు కాలం వెనక్కి వస్తే బాగుండు నిన్నని రేపుగా చేసే ప్రయత్నంలో నన్ను నేను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నాను;;;; chaalaa baagundi
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs