
తెలంగాణ వచ్చినంక తన్నుకుంటె మంచిది
రాజకీయ పచ్చబొట్టు అప్పుడైతే ఉంటది
తాగి తాగి మర్మమంత యీడ్సుడేంది బజారుకు
దొరుకుతారు యెలక్షన్లో పంపుతారు సమాధులకు
కల్లకుండ లొల్లితోటి తెలంగాణ రాదు
గాలానికి చిక్కారా ప్రక్షాళనకు మీకు లేదు
రోజుకొక్క ముసలంతో నడుస్తోంది అలజడి
కొంపలార్పె జిత్తులతో పెడతారట రాక్షసబడి
పారిపోయె ఉత్తరులే చిచ్చుబెట్ట చూస్తుండ్రు
కొట్టాల్సినోన్ని వొదిలి జతకడుతూనే తరుముతుండ్రు
రాజకీయ దయ్యాలకు తెలంగాణ కోళ్లు
బెదరకుండ తొడలు గొడ్తు సవాల్ మీద సవాళ్లు
తెలంగాణ నాటకంల అందరూ సూపర్ స్టార్లే
గోతుల హరికథలు నడిపే భజనగాళ్లు వీళ్లే
ఒకే మాట వొకే బాట ప్రజలకైతే ఉంది కదా
మేకవన్నె పులులు ప్రజలైతే కాదు గదా
తెలంగాణ రాష్ట్రమైతే మనకైతే వొద్దు
వాళ్లకు ముందిచ్చేస్తే తెలంగాణకదే ముద్దు
తిరుగుబాటు కప్పలిపుడు చెరువులుంటె దండగా
నూతిలేసి మూసేస్తే ప్రజలకెంతో పండగ
రాజకీయ పచ్చబొట్టు అప్పుడైతే ఉంటది
తాగి తాగి మర్మమంత యీడ్సుడేంది బజారుకు
దొరుకుతారు యెలక్షన్లో పంపుతారు సమాధులకు
కల్లకుండ లొల్లితోటి తెలంగాణ రాదు
గాలానికి చిక్కారా ప్రక్షాళనకు మీకు లేదు
రోజుకొక్క ముసలంతో నడుస్తోంది అలజడి
కొంపలార్పె జిత్తులతో పెడతారట రాక్షసబడి
పారిపోయె ఉత్తరులే చిచ్చుబెట్ట చూస్తుండ్రు
కొట్టాల్సినోన్ని వొదిలి జతకడుతూనే తరుముతుండ్రు
రాజకీయ దయ్యాలకు తెలంగాణ కోళ్లు
బెదరకుండ తొడలు గొడ్తు సవాల్ మీద సవాళ్లు
తెలంగాణ నాటకంల అందరూ సూపర్ స్టార్లే
గోతుల హరికథలు నడిపే భజనగాళ్లు వీళ్లే
ఒకే మాట వొకే బాట ప్రజలకైతే ఉంది కదా
మేకవన్నె పులులు ప్రజలైతే కాదు గదా
తెలంగాణ రాష్ట్రమైతే మనకైతే వొద్దు
వాళ్లకు ముందిచ్చేస్తే తెలంగాణకదే ముద్దు
తిరుగుబాటు కప్పలిపుడు చెరువులుంటె దండగా
నూతిలేసి మూసేస్తే ప్రజలకెంతో పండగ














